Samantha:నో అఫైర్స్.. నో అబార్షన్స్.. సాకీపై మాత్రం నో క్లారిటీ
సామ్- చై.. డైవర్స్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. విడిపోయిన అంశానికి సంబంధించి ఏ చిన్న అంశమయినా సరే చర్చకు దారితీస్తోంది. అయితే ఇటీవల సమంతపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో సామ్ స్పందించారు. ఆడాళ్ల తప్పులనే ప్రశ్నిస్తారా.. మగాళ్లు తప్పు చేయరా అంటూ విరుచుకుపడ్డారు. తన గురించే చర్చ చేయడంతో ఆమె ఇలా అటాక్ చేశారు.

థాంక్స్..
ఒకరి వ్యక్తిగత జీవిత సంక్షోభం గురించి మీడియా, నెటిజన్లు, పబ్లిక్ చూపిస్తున్న భావోద్వేగం చూసి సంతోషంతో పొంగిపోతున్నా అని సామ్ అన్నారు. తనపై చూపిన గాఢమైన సానుభూతి.. మీరు తన జీవితంపట్ల చూపిస్తున్న ఆందోళనకు ధన్యవాదాలు తెలిపారు. తనపై వస్తున్న తప్పుడు కథనాలు, పుకార్లను తిప్పికొడుతున్నందుకు కూడా థాంక్స్. నాకు ఎఫైర్స్ ఉన్నాయనీ.. పిల్లలను ఎన్నడూ కోరుకోలేదని.. అవకాశవాదినని వాళ్లు అంటున్నారు. కొన్ని అబార్షన్స్ కూడా చేయించుకున్నానని ఇపుడు సరికొత్త కథనాలు ప్రచారం చేస్తున్నారు అని తన మెసేజ్ లో పోస్ట్ చేసింది సమంత.

బాధాకరం..
విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు.

ప్రీతమ్.. కానీ
నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతగాణ్ణి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.

మరీ సాకీ సంగతి
రీసెంట్‌గా సమంత కూడా తన గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దిరోజుల క్రితం తన పేరు నుంచి అక్కినేని ఇంటి పేరుని వేరు చేసిన సమంత.. ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు పెట్టుకుంది. ఇక చైతు, సమంత ఇద్దరూ కూడా టాటూలు రిమూవ్ చేసుకున్నారని కూడా అంటున్నారు. అయితే గతేడాది సామ్ 'సాకీ' అనే ఫ్యాషన్ బ్రాండ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే 'సాకీ' సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్‌తో ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడింది సామ్. అయితే 'సాకీ' గురించి కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి..SAAKI లో SA అంటే సమంత.. AKI అంటే అక్కినేని.. మరి చై - సామ్ విడిపోయారు కదా.. ఇప్పుడు 'సాకీ' పేరు మారుస్తారా?' అంటూ నెట్టింట్లో పలు కామెంట్స్ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications