ఆ గ్లాస్ అదీ కాదు, జనసేనతో సంబంధం లేదు: అడివి శేష్
ఇప్పుడు మూవీస్‌కు సంబంధించినవీ అయినా సరే.. లేదంటే మరేదైనా ఇష్యూ అయినా సరే ట్రెండ్ అవుతుంది. కాపీ, పాలొ అని అంతా అంటున్నారు. మీడియా ప్రతినిధులు అడగడం, సదరు సెలబ్రిటీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక విషయానికి వస్తే నిన్న హిట్-2 మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందులో అడవి శేష్ పట్టుకున్న గ్లాస్.. జనసేన గ్లాసును పోలి ఉంది. దీంతో శేష్ మీడియాకు సమాధానం ఇచ్చారు.
హిట్-2 ఓ పోస్టర్ లో అడివి శేష్ ఓ టీ గ్లాసు పట్టుకుని కనిపించారు. అది జనసేన గ్లాసును పోలి ఉంది. అడివి శేష్ స్పందిస్తూ.. తమ చిత్రానికి, జనసేనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ పోస్టర్ లో కనిపిస్తుంది జనసేన గ్లాసు కాదని అన్నారు. మాములు గ్లాస్ అని స్పష్టంచేశారు. పవన్ కల్యాణ్, ఆయన తనయుడు అకీరాలకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని వెల్లడించారు.

శైలేశ్ కొలను దర్శకత్వంలో హిట్-2 మూవీ గతంలో వచ్చిన హిట్ సినిమాకు సీక్వెల్. హిట్-2 చిత్రం డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాఖలో ఓ యువతి హత్య కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హిట్ మూవీ కూడా చాలా సక్సెస్ అయ్యింది. శైలేష్ కొలనుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు హిట్-2పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇటీవల వచ్చిన మేజర్ మూవీతో అడవి శేష్ మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు గూఢచారీ లాంటి సినిమాతో కూడా గుడ్ నేమ్ ఉంది. విభిన్న కథాంశాలను ఎంచుకున్నారు.












Click it and Unblock the Notifications