వైరల్ : సాధారణ మహిళలు డ్రమ్స్ వాయిస్తే..! ఇలా ఉంటది (వీడియో)

హైదరాబాద్ : అనుకోవాలే గానీ ఏదైనా సుసాధ్యమే అని నిరూపిస్తున్నారు సాధారణ మహిళలు. అవకాశం రావాలే గానీ తాము ఎందులోనూ తీసిపోమని ప్రూవ్ చేసుకుంటున్నారు. మహిళలు వంటింటికే పరిమితం అనేది ఒకప్పటి మాట. తమ టాలెంట్ తో సునామీ లాంటి రికార్డులు సృష్టిస్తున్న సందర్భాలున్నాయనేది ఇప్పటి మాట. ఈ క్రమంలో కొందరు మహిళలు లయబద్దంగా డ్రమ్స్ వాయించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రొఫెషనల్స్ ను మించి డ్రమ్స్ వాయించిన ఈ మహిళలకు నెటిజన్లు శభాష్ అంటూ కితాబిస్తున్నారు. ఒక వేడుకలో భాగంగా కొందరు మహిళలు కలిసి ఇలా డ్రమ్స్ వాయించి అతిథులను ఆకట్టుకున్నారు. అయితే అది ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు గానీ.. మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రాకు చేరేలా నెటిజన్లు ట్యాగ్ చేశారు. ఆయన వాట్సాప్ వండర్ బాక్స్ (#whatsappwonderbox) హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ అయింది.

normal women playing drums with excellent performance viral video

ఆనంద్ మహీంద్రా.. ఇలాంటి వీడియోలను బాగా ఇష్టపడతారు. అంతేకాదు టాలెంట్ కనబరిచేలా ఉండే ఫోటోలు, వీడియోలపై ఫోకస్ పెడతారు. అందులోని వ్యక్తుల ఆచూకీ కనుక్కొని మరీ వారిని ఎంకరేజ్ చేస్తారు. కొందరికి ఆర్థికసాయం చేస్తూ వారి ఉన్నతికి దోహదపడతారనే పేరుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+