బొగ్గు బ్లాకుల వేలమా..? కేసీఆర్ సర్కార్‌పై షర్మిల ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు బ్లాకులను వేలం వేయవద్దని YSR తెలంగాణ పార్టీ చీఫ్ వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. నాలుగు బొగ్గు బ్లాక్ ల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ బెల్ట్ లోని నాలుగు గనులను ఈ నెల 13న వేలం వేయాలని నిర్ణయించడంపై షర్మిల స్పందించారు. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల సమ్మెకు వైయస్ షర్మిల మద్దతు తెలిపారు.

థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందన్నారు. ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని వివరించారు. బొగ్గు బ్లాక్ లను వేలం వేయడంతో సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కేంద్రం ట్రెంచ్ 13 కింద సత్తుపల్లి బ్లాక్ - 3, శ్రావణపల్లి బ్లాక్, కోయగూడెం బ్లాక్, ఓపెన్ కాస్ట్ బ్లాకులు కల్యాణఖని బ్లాక్ - 6 పై ప్రభావం చూపనుంది. ఈ బ్లాక్ లను సింగరేణికే కేటాయించాల్సి ఉంది.

not Auction in coal block:ys sharmila

తెలంగాణలో 7 థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి. 4 బ్లాకుల అన్వేషణకు సింగరేణి రూ.కోట్లలో వెచ్చిస్తే ఇప్పుడు ఒక ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడమేంటి..? కార్పొరేట్ శక్తులకు సింగరేణిని ధారాదత్తం చేస్తుంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బిల్లును వ్యతిరేకించలేదన్నారు. ఇప్పుడు సింగరేణిలో బ్లాక్ లను వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీకి లేఖలు రాసామని కేసీఆర్ చెబుతున్నాడు. ఆ లేఖను కేసీఆర్ బహిర్గతం చేయాలని కోరారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేయాలి. పోరాటం చేయలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. మాయ మాటలతో కేసీఆర్ కాలం వెల్లదీస్తున్నారని ప్రకటనలో తెలిపారు.

Recommended Video

    History of Air Crashes in India

    అంతకుముందు ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే..? లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు. లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారని అడిగారు. ఇంకో 80 వేలు మళ్లీ ఇచ్చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. 80 వేల ఉద్యోగాలు ఏమిటి..? పీఆర్సీ ప్రకారం 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం లక్ష 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం లక్ష 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఉద్యోగాలకు కూడా కేంద్రమే ఆలస్యం చేస్తోందని కేసీఆర్ చెబుతున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+