Kumari Aunty: కుమారి ఆంటీనే కాదు మిగతా వారిని కాస్త చూడండి..!
కుమారి ఆంటీ.. ఇప్పుడు ట్రెండింగ్ మహిళగా ఉన్నారు. సోషల్ మీడియాతో ఆమె ఫేమస్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఆమె రోడ్డు పక్కన ఫుడ్ కోర్టు నడుపుతున్న సంగతీ తెలిసిందే. అయితే సోషల్ మీడియా ద్వారా ఆమె షాపుకు భారీగా గిరాకీ వస్తోంది. అయితే అదే చోట చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్ కోర్టు నడుపుతున్నా.. వారికి గిరాకీ సరిగా లేదు. కుమారి ఆంటీ షాపులో ఫుడ్ టెస్ట్ ఉన్నట్టే.. పక్క ఉన్న ఫుడ్ కోర్టుల్లో కూడా ఉంది.
కానీ సోషల్ మీడియా ఆమెను భారీగా ప్రమోట్ చేయడంతో కుమారికి గిరాకీ పెరిగింది. దీంతో ఆ రాబడి కూడా పెరిగింది. పేద మహిళ ఫుడ్ కోర్టు పెట్టుకుని నడుపుకుంటున్నారు. మంచిదే.. కానీ ఆమె షాపు వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆ రూట్ లో వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానీ కొంత మంది పేద మహిళపై ప్రభుత్వం దౌర్జన్యం అని మాట్లాడారు.

మరికొందరు ఆమె ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహిళన అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. కుమారి ఆంటీ వల్ల అక్కడున్న మిగతా ఫుడ్ కోర్టుల వారు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు చెబుతున్నారు . కుమారి ఆంటీకి అక్కడ షాపు నడవకపోయిన ఫర్వాలేదని.. ఎందుకంటే ఆమె ఇప్పటికే సంపాదించుకున్నారని.. కానీ తమకు గిరాకీ లేక ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంటున్నారు.
అక్కడ తినే వారు కూడా ఒక్కసారి ఆలోచించాల్సి అవసరం మాత్రం ఉందని కోరుతున్నారు. ఒక్క కుమారి ఆంటి వద్దనే కాకుండా తమ వద్ద కూడా వచ్చి తింటే సాయం చేసిన వారు అవుతారని విజ్ఞప్తు చేస్తున్నారు. ఆలోచించండి.. ఒక్కరు బతకడం కావాలా.. లేక పది మంది బతకడం కావాలా.. మీరే నిర్ణయించుకోవాని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications