న్యూడ్‌గా అబ్బాయి, అమ్మాయి వీడియో కాల్.. క్యాప్చర్ చేసిన సైబర్ నేరగాళ్లు, రూ.లక్షలు వసూల్..

సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఎక్కడ తమ గాలానికి చిక్కుతారా అని ఎదురుచూస్తున్నారు. అయితే కొందరికీ యువతుల నెంబర్లు పంపించీ మరీ వల వేస్తున్నారు. అయితే ఆ నంబర్లకు టెంప్ట్ అయి ఫోన్ చేశారో ఇక అంతే సంగతులు. మీ జేబు గుల్ల అవడమే కాదు.. పరువు కూడా పోతోంది. హైదరాబాద్‌కి చెందిన ఓ టెకీకి ఇలానే జరిగింది. అతని న్యూడ్ ఫోటోలు క్యాప్చర్ చేసి.. బెదిరింపులకు పాల్పడటంతో.. అడిగినంత ఇచ్చేశారు. కానీ తరచూ డబ్బుల కోసం ఫోన్ చేయడంతో.. ఫోన్ లిప్ట్ చేయడమే మానేశాడు. ఇంకేముంది వారు తమ బుద్దిని చూపించడంతో.. బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.

 వలలో సాప్ట్‌వేర్ ఇంజినీర్..

వలలో సాప్ట్‌వేర్ ఇంజినీర్..

హైదరాబాద్‌కి చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కారు. అయితే అతనికి పెళ్లి కాలేదు. బ్యాచిలర్‌గా ఉంటూ.. వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పట్లో ఆఫీసులు తెరిచే అవకాశం కూడా లేదు. అయితే అతనికి ఒక నంబర్ నుంచి కాల్ వచ్చింది. అందమైన అమ్మాయిలతో డేటింట్ అంటూ మేసెజ్ వచ్చింది. దీంతో ఆ యువకుడు టెంప్ట్ అయ్యాడు. మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెబితే నమ్మి.. నంబర్‌కు ఫోన్ చేశాడు. ఇక అంతే అతని జీవితాన్ని బుగ్గి చేసింది. అటు వైపు నుంచి యువతి సమాధానాలు చెప్పింది. డేటింగ్, ప్యాకేజీ గురించి చెప్పడంతో.. అందుకు అతను అంగీకరించాడు.

 డేటింగ్ కోసం రిజిస్ట్రేషన్..

డేటింగ్ కోసం రిజిస్ట్రేషన్..

డేటింగ్ అనడంతో రిజిష్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాడు. తర్వాత యువతుల నుంచి అశ్లీల ఫోటోలు వచ్చాయి. తర్వాత యువతి చాట్ కూడా చేసింది. రూ.20 వేలు పంపిస్తే నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతానని చెప్పింది. కానీ అప్పటికీ కూడా అతను.. తనను సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారని గ్రహించలేకపోయాడు. ఆమె చెప్పడంతో యువకుడు రూ.20 వేలు ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత యువతి కూడా న్యూడ్‌గా వీడియో కాల్ చేసి.. మాట్లాడింది. ఆ సమయంలో సైబర్ కేటుగాళ్లు.. వీరిద్దరినీ ఫోటోలను క్యాప్చర్ చేశారు. ఇంకేముంది సాప్ట్ వేర్ ఇంజినీర్ అడ్డంగా దొరికిపోయాడు.

నగ్న చిత్రాలు తీసి..

నగ్న చిత్రాలు తీసి..

తర్వాత సైబర్ కేటుగాళ్లు లైన్ ‌లోకి వచ్చారు. నగ్న చిత్రాల గురించి చెప్పారు. దీంతో అతని గుండే గుబేల్ మంది. వామ్మో అంటూ భయపడిపోయారు. క్రమంగా డబ్బులను డిమాండ్ చేశారు. లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. తప్పకపోవడంతో డబ్బులు పంపించాడు. తొలుత రూ.50 వేలను ఇష్టం లేకున్నా సమర్పించుకున్నాడు. కానీ సైబర్ కేటుగాళ్ల వదలలేదు. అలా రెండు, మూడుసార్లు నగదు వసూల్ చేశారు. అతను రూ.2 లక్షల వరకు డబ్బులను ట్రాన్స్ ఫర్ చేశారు. అయినా వారి ఆగడాలు ఆగలేదు. మళ్లీ మళ్లీ ఫోన్ చేశారు. కానీ ఈసారి అతను ఫోన్ ఎత్తలేదు. వదిలేస్తారని అనుకున్నాడు.

Recommended Video

    Sonu Sood Has The Best Solution’ As Woman Complains About Her Husband
     సోషల్ మీడియాలో పోస్ట్..

    సోషల్ మీడియాలో పోస్ట్..

    కానీ డబ్బులకు అలవాటుపడ్డ వారు.. తమకు వినడం లేదని భావించారు. ఇంకేముంది ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ చిత్రాలను చూసి యువకుడు షాకయ్యాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి.. కేసును ఛేదించేపనిలో నిమగ్నమయ్యారు. అయితే వివిధ సైట్లు ఓపెన్ చేయొద్దని కోరుతున్నారు. తెలిసినవారే.. సైబర్ కేటుగాళ్ల బరిలో పడుతున్నారని పేర్కొన్నారు. వీలయినంత దూరంగా.. మిగతా సైట్లకు దూరంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+