Numaish 2024: కాసేపట్లో ప్రారంభం కానున్న నుమాయిష్ ఎగ్జిబిషన్.. టైమింగ్స్ ఇవే..

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో మైదానంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎగ్జిబిషన్ ను జనవరి 1వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే నుమాయిష్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతోంది. 46 రోజుల పాటు సాగే నుమాయిష్- ఎగ్జిబిషన్ కు టికెట్ ధరలు, విజిటింగ్ అవర్స్ లల్లో ఎటువంటి మార్పు చేయలేదన్నారు.

ఈ గతేడాది టికెట్ ధరలనే కొనసాగించనున్నారు. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.

Numaish Exhibition is about to start at Nampally Exhibition Ground

ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ పై నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్ వనం, కార్యదర్శి హనుమంతరావుతో కలిసి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు.

మాయిష్ ను గతం కంటే అట్టహాసంగా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. కరోనా ప్రభావం ఉన్నందున సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు. ఈ ఎగ్జిబషన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులు రానున్నారు. ఇక్కడ అన్ని రకాల వస్తులు అందుబాటులో ఉండనున్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+