Hyderabad: ఆ హోటళ్లో తింటున్నారా.. అయితే ముందే ఆస్పత్రికి వెళ్లండి..!
హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతోన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై తెలంగాణ ఆహార భద్రత కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం దాడులు చేసింది. డిసెంబరు 11న మాదాపూర్ లోని పలు స్వీట్ షాపుల్లో తనిఖీలు చేసింది. అలాగే జూబ్లీహిల్స్‌లోని బెజవాడ భోజనం, మాదాపూర్‌లోని ఆరంభం (మిల్లెట్ ఎక్స్‌ప్రెస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్)లో ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘించినట్లు గుర్తించారు.
బెజవాడ భోజనం, ప్రఖ్యాత డైనింగ్ డెస్టినేషన్ ప్రాథమిక ఆహార భద్రత లోపించినట్లు అధికారులు పేర్కొన్నారు. రెస్టారెంట్లలో FSSAI లైసెన్స్ ప్రముఖంగా కనిపించలేదన్నారు. ఫుడ్ హ్యాండ్లర్‌ల కోసం నీటి విశ్లేషణ నివేదికలు, మెడికల్ ఫిట్‌నెస్ రికార్డ్‌లు వంటి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ కూడా లేదని గుర్తించారు. వంటగదిలో తుప్పు పట్టిన కత్తులు, అపరిశుభ్రమైన రిఫ్రిజిరేటర్లు, సరిగ లేని ఆహార నిల్వలు ఉన్నట్లు చెప్పారు.

బంగాళాదుంపలు సరిగా లేవని చెప్పారు. గడువు ముగిసిన టోన్డ్ మిల్క్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే తయారుచేసిన ఆహారాన్ని సరిగ్గా లేబుల్ చేయలేదని వివరించారు. సేఫ్టీ ప్రోటోకాల్‌లను ఉల్లంఘిస్తూ శాఖాహారం, మాంసాహార వస్తువులు కలిసి ఉంచినట్లు తేల్చారు. రెస్టారెంట్లలో శిక్షణ పొందిన సూపర్‌వైజర్ కూడా లేరని పేర్కొన్నారు. హైదరాబాదులోని మరో ప్రముఖ రెస్టారెంట్ అయిన ప్రారంభమ్‌లో జరిగిన సోదాల్లో ఇలాంటి లోపాలనే గుర్తించారు.
FSSAI లైసెన్స్ ప్రదర్శించలేదు. వంటగది సరిగా లేదని, సమర్థవంతమైన శుభ్రతకు ఆటంకం కలిగిస్తుందని వివరించారు. రిఫ్రిజిరేటర్లు సరిగా లేవని వివరించారు. లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను రూ.21,893 విలువైన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. వీటిలో పదార్థలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు ఆహార భద్రత నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లో నిరంతరం తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు.
𝗔𝗿𝗮𝗺𝗯𝗵𝗮𝗺 (𝗠𝗶𝗹𝗹𝗲𝘁 𝗘𝘅𝗽𝗿𝗲𝘀𝘀 𝗙𝗼𝗼𝗱 𝗣𝘃𝘁 𝗟𝘁𝗱), 𝗠𝗮𝗱𝗵𝗮𝗽𝘂𝗿
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) December 11, 2024
11.12.2024
* FSSAI License not displayed prominently.
* Refrigerators not maintained properly and found with food waste.
* Kitchen found to be congested and cannot facilitate proper… pic.twitter.com/l1qwiokzRY












Click it and Unblock the Notifications