Hyderabad: ఖాళీ కనిపిస్తున్న హైదరాబాద్ రోడ్లు.. ఎప్పుడు ఇలానే ఉంటే..
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చాలా మంది సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సాధారణంగా బతుకమ్మ, దసరా పండక్కి తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ సంక్రాంతికి తెలంగాణ జిల్లాలకు చెందినవారితో పాటు ఆంధ్రా వారు కూడా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో హైదరాబాద్ సగం ఖాలీగా కనిపిస్తోంది. ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్ని ప్రస్తుతం ఖాళీగా దర్శనిస్తున్నాయి. అసలు ట్రాఫిక్ అనే మాటే వినిపించడం లేదు.
ప్రస్తుతం హైదరాబాద్ సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయిందని చెప్పుకొవచ్చు. సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు పట్నం వాసులంతా పల్లెలకు వెళ్లారు. షాపు సెట్లర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సెలవుల కారణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో స్కూల్ జోన్లు కూడా బోసిపోయాయి. సంక్రాంతి మూడు రోజులు హైదరాబాద్ లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

సెలవులకు సాఫ్ట్ వేర్లంతా ఊరి బాట పట్టడంతో ఐటీ క్యారిడార్లు బోసిపోయాయి. వందలాది ఫుడ్ కోర్టులు కూడా షట్ డౌన్ అయ్యాయి. హైదరాబాద్ వాసులంతా గ్రామాలకు తరలివెళ్లడంతో.. సిటీలోని పలు ప్రాంతాల్లో నిఘా పెంచినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. తాళలు వేసిన ఇళ్లే టార్గెట్ గా దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండటంతో పెట్రోలింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో మంగళవారం నుంచి ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ లోకల్ వారు ఎప్పుడు ఇలానే ఉంటే బాగుటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి ట్రాఫిక్ లేదని, తొందగర వెళ్తున్నామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications