ఒకప్పుడు యమహా ఆర్ఎక్స్100.!ఇప్పుడు బుల్లెట్..ధ్వనులతో హోరేత్తిపోతున్న కాలనీలు.!

యువత క్రేజీగా నడుపుతున్న ద్విచక్ర వాహనాల నుండి వచ్చే సౌండ్ ఎంతో ఇబ్బందిగా మారిందని, యువత కాలనీల్లో బైక్ లు నడుపుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

హైదరాబాద్ : ద్విచక్ర వాహనాలను నడపడంలో యువత పోటీ పడుతుంటారు. ఇక టీనేజ్ కుర్రకారునైతే అసలు ఆపలేం. సాధారణ బైక్ పైనే అనేక విన్యాసాలు చేసే యువత యమహా ఆర్ఎక్స్100, బుల్లెట్, కేటీఎమ్ వంటి బైక్ లు చేతికందితే వారి వేగానికి పరిమితులుండవు. అది కాలనీ ఐనా, హైవే రోడ్డైనా రయ్ మని అత్యంత వేగంగా దూసుకెళ్తుంటే చూసేవారికి బీపీ రెండింతలవ్వాల్సిందే. ఇంత వరకూ యువత బైక్ లపై చేసే వేగవంతమైన విన్యాసాలు బాగానే ఉన్నప్పటికీ వారు నడుపుతున్న వాహనాల నుండి వచ్చే ధ్వనులు మాత్రం భరించలేకుండా ఉందనే చర్చ నగర కాలనీల్లో జరుగుతోంది.

సైలెన్సర్ల ద్వారా ధ్వనుల హోరు..

సైలెన్సర్ల ద్వారా ధ్వనుల హోరు..

ఒకప్పుడు యమహా ఆర్ఎక్స్100 బైక్ కు పిస్టిన్ లో ఉండే మఫ్లర్ తొలగిస్తే ఆ బైక్ సైలెన్సర్ నుండి వచ్చే ధ్వని రెట్టింపుగా ఉండేది. ఆ ధ్వని వల్ల కుర్రకారు మరింత జోరుగా బైక్ లను నడిపిస్తుండే వారు. అది కాలనీ ఐనా, ఇతర రోడ్లైనా అదే ద్వనితో దూసుకెళ్లడం హాబీగా మార్చుకున్నారు.

కొన్నాళ్లు ఈ ట్రెండ్ ను క్రేజీగా అనుసరించిని యువత తర్వాత మార్కెట్ లోకి వచ్చిన అనేక రకాల ద్విచక్ర వాహనాలపై దృష్టి కేంద్రీకరించారు. అందులో వాహనాల సైలెన్సర్ల నుండి వచ్చే సౌండ్ ను బట్టి ఆ బైక్ లను సొంతం చేసుకోవడానికి యువత ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

బైకులతో న్యూసెన్స్ చేయడమే లక్ష్యమా.?

బైకులతో న్యూసెన్స్ చేయడమే లక్ష్యమా.?

అనేక కంపెనీల తాజా బైక్ లు యువత అభిరుచులకు తగ్గట్టు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ద్విచక్ర వాహనాలు కూడా యువతను పెద్ద ఎత్తున ఆకర్శిస్తున్నాయి.

గతంలో మాదిరి కిక్ సిస్టం కాకుండా ఆటో స్టార్ట్ ప్రతి వాహనానికి అందుబాటులో ఉండడంతో యువతకు బైక్ ఎంత హెవీగా ఉన్నా స్టార్ట్ చేయడం, నడపడం ఎంతో సులువుగా మారింది. దీంతో బైక్ ఎంత పెద్దదిగా ఉన్నా మారిన సాంకేతికతతో నడపడం నేటి యువతకు ఎంతో సులభతరం అయ్యింది.

అసహనంలో నగర కాలనీ వాసులు.. భరించలేని ద్విచక్ర వాహన ధ్వనులు..

అసహనంలో నగర కాలనీ వాసులు.. భరించలేని ద్విచక్ర వాహన ధ్వనులు..

ఇంతవరకూ కథ బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది. బైక్ లను కొనుక్కోవడంలో యువత వైవిద్యం చూపిస్తూ రకరకాల నూతన బైక్ ల మీద దూసుకెళ్తుండడం చూస్తుంటే స్నేహితులకు, తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తున్నా ఇతర ప్రజానికానికి మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారింది. యువత నూతన బైక్ ల సవారీ వెనక ఓ వర్రీ కూడా దాగుందన్న అంశాన్ని వారు గుర్తుంచుకోవాలంటున్నారు కాలనీ వాసులు. బైక్ పై వేగంగా దూసుకెళ్లడమే కాకుండా దానివల్ల కలుగుతున్న అసౌకర్యాలను కూడా యువత పరిగణలోకి తీసుకోవాలంటున్నారు నగర కాలనీ వాసులు.

వాహనాల ధ్వనులను కట్టడిచేసేదెవరు..?

వాహనాల ధ్వనులను కట్టడిచేసేదెవరు..?

అధునాతన ద్విచక్ర వాహనాలను నడుపుతున్న యువత, వారి వాహనాల సైలెన్సర్ల నుండి వచ్చే మోత కర్ణబేరిని ఛిద్రం చేసే విధంగా ఉందని, రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్ లకు కంపెనీ నుండి కాకుండా అదనంగా అమర్చే సైలెన్సర్ల ద్వారా వచ్చే ధ్వని భరించలేకుండా ఉందని, కాలనీల్లో సుమారు అర కిలో మీటరు వరకూ ఈ ధ్వని కొనసాగుతుందంటున్నారు కాలనీ వాసులు. ఈ ధ్వని వల్ల అర్ధరాత్రుళ్లు నిద్రలో కూడా ఉలిక్కిపడి మేల్కోవాల్సి వస్తుందంటున్నారు.

ఇక చిన్న పిల్లలు గాఢ నిద్రలో ఉన్నా ఈ బుల్లెట్ ధ్వనులకు లేచి కూర్చును ఏడ్చేస్తున్నారని పేరెంట్స్ వాపోతున్నట్టు తెలుస్తోంది. యువత తమ అభిరుచులకు తగ్గట్టు బైక్ లను నడుపుకోవచ్చు కానీ అత్యంత భయంకరంగా ధ్వనులు చేస్తూ సమయ పాలన లేకుండా కాలనీల్లో న్యూసెన్స్ చేస్తుంటే నియంత్రించేంది ఎవరేనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+