మళ్లీ ముందస్తే.. ఆగస్ట్ 15 తర్వాత, రాసి పెట్టుకొండి అని రేవంత్ సవాల్

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. తొలి టర్మ్ కూడా పూర్తి కాకముందే ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని రద్దు చేసి.. 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. రేవంత్ కామెంట్స్ మాత్రం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆయన రాసిపెట్టుకోవాలని మరీ సవాల్ చేయడం చూస్తుంటే.. కేసీఆర్ మనసెరిగి మాట్లాడుతున్నారా అనే సందేహం కలుగుతుంది.

ఆగస్ట్ 15వ తేదీ తర్వాతే..

ఆగస్ట్ 15వ తేదీ తర్వాతే..

ఊరికే కామెంట్ చేయడం కాదు.. వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని చెప్పారు. ఎన్నికలకు వెళ్లడం ఖాయం అని.. ఇందులో మార్పు లేదని చెప్పారు. అంటే దాదాపు ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలకు వెళతారని అర్థ.. అంటే ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా అనే అంశం చర్చ జరుగుతుంది. 6 నెలలు అంటే కష్టంగా అంగీకరించవచ్చు.. కానీ 18 నెలలు అంటే మామూలు విషయం కాదు. మరీ రేవంత్ రెడ్డి ఏ సోర్స్ బట్టి కామెంట్ చేశారో తెలియలేదు. కానీ ఇదీ మాత్రం సంచలనంగా మారింది.

కేటీఆర్‌ను సీఎం చేయరు

కేటీఆర్‌ను సీఎం చేయరు

ఇటు కేటీఆర్‌ను సీఎం చేయరు అని కూడా రేవంత్ అన్నారు. వాస్తవానికి కేటీఆర్‌ను సీఎం చేసేందుకు మార్పు చేర్పులు అనే ప్రచారం ఉంది. కానీ రేవంత్ వెర్షన్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్దంగా ఉంది. దీంతోపాటు తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. టీడీపీలో అన్నీ పదవులకు రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఎలా అధ్యక్షుడో.. తాను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అని చెప్పారు.

Recommended Video

    Bandi Sanjay, Revanth Reddy, YS Sharmila Padayatras కొత్త బిచ్చగాళ్ళు.. KTR
    రాసి పెట్టుకో

    రాసి పెట్టుకో

    రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చానీయంశంగా మారాయి. రాసి పెట్టుకోవాలని.. బల్లగుద్ది మరీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మరీ దీనిపై అధికార టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలీ మరీ.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+