తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు:. 25కు చేరిన సంఖ్య

ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. తెలంగాణలో రోజు కేసులు వస్తున్నాయి. నిన్న నాలుగు రాగా.. ఇవాళ ఒక కేసు వెలుగుచూసింది. హైదరాబాద్‌లో మరో వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. కెన్యా నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్‌ వైరస్ సోకింది. హయత్‌నగర్‌లో ఉన్న అతడిని వైద్యులు టిమ్స్‌కు తరలించారు. బాధితుడి కాంటాక్ట్‌ను గుర్తించి వైద్యులు టెస్టులు చేస్తున్నారు. ఈ కేసుతో కలిసి రాష్ట్రంలో ఒమిక్రాన్ సంఖ్య 25కు చేరింది.

 90 మందికి చికిత్స..

90 మందికి చికిత్స..

మంగళవారం విదేశాల నుంచి 726 మంది రాష్ట్రానికి వచ్చారు. వీరిలో ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. ఇప్పటివరకు ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారిలో 59 మందికి కొవిడ్‌ నిర్ధారణ కాగా.. 13 మంది జన్యు విశ్లేషణ రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌ ఆస్పత్రి వైద్యుడికి.. చికిత్స కోసం వచ్చిన సోమాలియా వ్యక్తి నుంచి ఒమిక్రాన్‌ సోకింది. అనంతరం సదరు వైద్యుడు 90 మంది రోగులకు చికిత్స చేశారు. వీరి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ఆస్పత్రిలోని ఆయన కాంటాక్టులు అందరినీ క్వారంటైన్‌కు పంపారు.

 23 ఏళ్ల వ్యక్తికి వైరస్

23 ఏళ్ల వ్యక్తికి వైరస్

హయత్ నగర్‌లో 23 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆ యువకుడు తాజాగా సుడాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు తెలిపారు అధికారులు. ఇక తాజాగా నమోదైన కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది. ఒమిక్రాన్ సోకిన యువ‌కుడిని అధికారులు గ‌చ్చిబౌలి టిమ్స్‌కు త‌ర‌లించారు. ఆ యువ‌కుడి కాంటాక్ట్‌ల‌ను గుర్తించి శాంపిళ్ల‌ను ఆరోగ్య శాఖ అధికారులు సేక‌రిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దేశంలో 213 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు ఉండగా ఆ తర్వాత ఢిల్లీలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల్లో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది.

Recommended Video

    Omicron Variant: Restrictions On New Year 2022 Celebrations | Oneindia Telugu
     ఒకరికీ సీరియస్

    ఒకరికీ సీరియస్

    ఇటు టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించామని నిన్న తెలిపారు. మిగతా వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఒమిక్రాన్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్‌ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే రోజుకు 48 శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇవాళ వచ్చిన కేసుల్లో ఇద్దరు నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చినవారు. మరో ఒకరు కాంటాక్ట్ పర్సన్ నుంచి వైరస్ సోకింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+