ఉల్లి కొనబోతే కంట కన్నీరే.. నెల రోజులు తప్పదా ఈ గోస?
Recommended Video
హైదరాబాద్ : ఉల్లి ఘాటేమో గానీ.. ధరలు మాత్రం కంట నీరు తెప్పించేలా ఉన్నాయి. మొన్నటి వరకు అటు ఇటుగా 20, 25 రూపాయలున్న కిలో ఉల్లిపాయల ధర ఆమాంతం 35 రూపాయలు పలుకుతోంది. ఈ ధరలు ఇంకా పెరిగే ఛాన్సుందన్న వార్తల నేపథ్యంలో జనాలు టెన్షన్ పడుతున్నారు. అయితే ధరలు అదుపులోనే ఉన్నాయని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అనంతయ్య మీడియాకు తెలిపారు. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఉల్లి ధరలకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావించారు.
ఉల్లి ధరల ఘాటు మరో నెల రోజులు భరించక తప్పదన్నారు అనంతయ్య. అయితే ధరలు మాత్రం కంట్రోల్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతులు తక్కువ కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ క్రమంలో ఉల్లి ధర ప్రస్తుతం క్వింటాల్‌కు 3 వేల 300 రూపాయలు పలుకుతోందని తెలిపారు. అయితే ధరల అదుపుపై నిఘా ఉంచామని.. వ్యాపారులు ఒకవేళ రెచ్చిపోతే తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

ప్రస్తుతం రోజుకు కేవలం 15 వేల బస్తాల ఉల్లిపాయలు మాత్రమే దిగుమతి అవుతున్నాయని వివరించారు అనంతయ్య. 10 కిలోల హోల్ సేల్ ధర 280 రూపాయలు ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో కేజీ 35 రూపాయలు పలుకుతోందని చెప్పుకొచ్చారు. ఒకవేళ పరిస్థితులు తారుమారై ఉల్లి ధరలు అమాంతం పెరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ అనుమతి తీసుకుని రైతు బజార్లలో స్పెషల్ కౌంటర్ల ద్వారా ఉల్లి పాయలు తక్కువ ధరకు అందించేలా చూస్తామన్నారు. అదలావుంటే కొత్త పంట సెప్టెంబర్ నెల చివరి నాటికి వస్తుందన్నారు. అలా రాష్ట్రానికి ఉల్లి దిగుమతి మొదలైతే ధరలు కిలో 8 నుంచి 12 రూపాయల వరకు దొరికే ఛాన్సుందని తెలిపారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications