హైదరాబాద్ కు అరుదైన గుర్తింపు - బెంగళూరును వెనక్కునెట్టి: టెకీల డెస్టినేషన్..!!

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మరో అరుదైన గుర్తింపు దక్కించుకుంది. సిలికాన్ వ్యాలీ బెంగళూరును అధిగమించింది. ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనలో టాప్‌లో ఉంటున్న బెంగళూరును తొలిసారి హైదరాబాద్‌ వెనక్కునెట్టేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ -జూన్‌) కొత్త ఉద్యోగాల కల్పనలో 34 శాతం వాటాతో తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి. తెలంగాణలో ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్స్‌ ప్రారంభమయ్యాయి. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో టెకీలకు హైదరాదాబాద్ తొలి చిరునామాగా మారటానికి అడుగులు పడుతున్నాయి.

కొత్త ఉద్యోగాల్లో బెంగళూరుకు పోటీ గా హైటెక్‌ సిటీ..

కొత్త ఉద్యోగాల్లో బెంగళూరుకు పోటీ గా హైటెక్‌ సిటీ..

ఐటీ అనగానే దేశంలో తొలిగా చెప్పే పేరు బెంగళూరు. ఇప్పటి వరకు దక్షిణాదిన బెంగళూరు తో ఐటీ రంగంలో హైదరాబాద్ ధీటుగా పోటీలో నిలిచింది. కానీ, తొలి సారి బెంగళూరును కీలక అంశంలో దాటేసింది. ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటేసి అరుదైన గుర్తింపు దక్కించుకుంది. ఐటీ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రెండో స్థానం కు పరిమితమైంది. బెంగళూరు కంటే హైదరాబాద్‌లో ఒక శాతం నియామకాలు అధికంగా జరిగాయి. ముంబై (12 శాతం), పుణె (9), చెన్నై (5) తర్వాతి స్థానాల్లో నిలిచాయని ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించింది. ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ కాగా ఇందులోనూ హైదరాబాదే (1,49,506) టాప్‌ గా ఉంది. బెంగళూరు (1,48,500)ది ద్వితీయ స్థానంలో నిలిచింది.

బెంగళూరులో ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపు

బెంగళూరులో ఐటీ ఉద్యోగుల సంఖ్య దాదాపు రెట్టింపు

ఐటీ ఉద్యోగుల సంఖ్య బెంగళూరులో దాదాపు రెట్టింపు ఉంటుంది. హైదరాబాద్ పోటీ పడుతున్నా..ఇప్పట్లో అధిగమించటం సాధ్యం కాదు. కానీ, కొత్త ఉద్యోగాల కల్పనలో మాత్రం బెంగుళూరు కు ధీటుగా హైదరాబాద్ నిలుస్తోంది. ఏ ఐటీ సంస్థ అయినా ఎక్కడైనా..తమ కార్యాలయం నెలకొల్పాంటే ముందుగా పరిగణలోకి తీసుకొనేది మౌళిక వసతులు - సౌకర్యాలు- కనెక్టివిటీ. ఇందులో బెంగుళూరు ముందడుగు వేసింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటుచేసి కంపెనీలకు ఆహ్వానం పలికింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనూ ఆఫీస్ స్పేస్ వినియోగంలో గణనీయంగా మార్పు కనిపిస్తోంది. 2021-22లో బెంగళూరులో ఐటీ కంపెనీలు కొత్తగా 90.05 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను వినియోగించగా.. హైదరాబాద్‌లో అది 80.96 లక్షలుగా ఉంది. ఈ అంశంలోనూ వచ్చే ఏడాది కల్లా బెంగళూరును అధిగమించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి.

అంతర్జాతీయ ప్రముఖ ఐటీ కంపెనీలకు చిరునామాగా

అంతర్జాతీయ ప్రముఖ ఐటీ కంపెనీలకు చిరునామాగా

ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఐటీ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ లో తమ వ్యాపార విస్తరణకు అనువుగా గుర్తించాయి. తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. అమెజాన్‌ రెండో అతి పెద్ద కార్యాలయం హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసారు. హైదరాబాద్ కేంద్రంగా టీసీఎస్ లో ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ అతి పెద్ద డేటా సెంటర్‌ను నెలకొల్పుతోంది. టీసీఎస్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌ మరిన్ని కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్థిరత్వం, మౌలిక వసతుల వృద్ధితో కంపెనీలు మరిన్ని పెట్టుబడులు కొనసాగిస్తున్నాయి. దీంతో..ఉద్యోగ కల్పన పెరుగుతోంది. హైదరాబాద్ లో ఉన్న అనుకూల వాతావరణం.. శాంతి భద్రతల నిర్వహణ లో సమర్ధతవంగా వ్యవహరించటంతో ప్రముఖ వ్యాపార సంస్థలు హైటెక్ సిటీ వైపే ఆకర్షితులవుతున్నారు. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ పేరుతో ఐటీ కారిడార్‌ను విస్తరిస్తున్నారు. 'లుక్‌ ఈస్ట్‌' పేరుతో తూర్పు దిశగా విస్తరిస్తోంది. నలువైపులా ఐటీని వృద్ధి చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ దిశగా..

రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ దిశగా..

మంత్రి కేటీఆర్ ఐటీ శాఖను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు..ఐటీ విస్తరణలో ఏ చిన్న అవకాశం వదులుకోవటం లేదు. అదే సమయంలో మున్సిపల్ శాఖ కూడా కేటీఆర్ చూస్తుండటంతో పరిశ్రమ విస్తరణకు అవసరమైన మౌళిక వసతుల నిర్ణయాలు కేటీఆర్ వెంటనే అమలు చేస్తున్నారు. అందులో భాగంగా.. హైదరాబాద్ నాలుగు దిశలా వ్యాప్తి చెందున్న ఐటీ పరిశ్రమను తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఐటీ పార్కులు నెలకొల్పి, కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ హబ్స్‌ ను ప్రారంభించారు. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సిద్దిపేట, ఆదిలాబాద్‌లో కొత్తగా సిద్దం అవుతున్నాయి. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల విస్తరణకు నిర్ణయించారు. దీంతో..ఇప్పుడు బెంగుళూరుకు ప్రధాన పోటీ దారుగా ఉన్న హైదరాబాద్.. త్వరలోనే అరుదైన ఫీట్ సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+