ఎల్లుండి నుంచే పెండింగ్ చలానాల చెల్లింపు.. ఈ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే చాలు..
ట్రాఫిక్ చలానాలు తప్పవు.. రాంగ్ రూటో.. సీటు బెల్టో, హెల్మెట్ లేదనే కెమెరాల్లో బంధీ కావడం ఖాయం.. అయితే ఆ చలానా కట్టాలనే సోయి దాదాపు చాలా మందికి ఉండదు. ఏం చుద్దాంలే అనుకుంటారు. అంతా తీరా.. కట్టాల్సిందే అంటే అప్పుడు పరుగులు తీస్తారు. ఇక విషయానికి వస్తే.. చలానాకు సంబంధించి తెలంగాణ సర్కార్ రిబేట్ విధించింది. దీంతో చలానా ఉన్నవారు కట్టేందుకు సిద్దం అవుతున్నారు.

ఎల్లుండి నుంచే..
ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెండింగ్ చలానాలా ఈ లోక్ అదాలత్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి ప్రకటన గతంలో 2, 3 సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అప్పుడు పోలీసు శాఖ పెండింగ్ చలానా లోక్ అదాలత్ చేపట్టలేదు. ఇప్పడు ఇందుకు సంబంధించిన ఫైలు డీజీపీ కార్యాలయానికి చేరింది. ఇన్ చార్జి డీజీపీ ఆమోద ముద్ర వేయటమే మిగిలి ఉంది.

సాప్ట్‌వేర్ అప్‌డేట్
ఈలోక్ అదాలత్‌కు అనుగుణంగా అధికారులు ఈ చలానా పోర్టల్‌లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూల్ అయ్యాయి. మిగతా జరిమానాల కోసం పోలీసు శాఖ ఇప్పుడు రాయితీలు ప్రకటించింది. టూ వీలర్స్ 75 శాతం రాయితీతో ఈ-లోక్ అదాలత్‌లో చలానాలను క్లియర్ చేసుకోవచ్చు. అంటే ద్విచక్ర వాహనంపై రూ.1000 జరిమానా పెండింగ్‌లో ఉంటే రాయితీ పోగా రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి రూ.35 సర్వీస్ చార్జీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

జరిమానా చెల్లించొచ్చు..
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ https://echallan.tspolice.gov.in/publicviewలో పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. పోర్టల్ అప్ డేట్ చేస్తున్నందున ప్రస్తుతం ఈ చలానా స్టేటస్ సేవలను నిలిపివేశారు. త్వరలో పోర్టల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications