Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫొటో తీస్తానని చెప్పి లైంగికదాడి..?, ఫొటోగ్రాఫర్‌ సలీంపై పోక్సో సెక్షన్ల కింద కేసు

మీరు అమ్మాయా..? ఫొటో దిగాలనుకొంటున్నారా..? ఒంటిరిగా ఫొటో స్టూడియోకు వెళ్లే సాహసం చేస్తున్నారా..? వెంట మరేవరినైనా తోడు తీసుకెళ్లండి. ఒక్కరు మాత్రం వెళ్లే ధైర్యం చేయొద్దు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా కూడా కొందరు ఫొటోగ్రాఫర్లు రెచ్చిపోతున్నారు. స్టూడియోకొచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

నేరేడెమెట్ పోలీసుస్టేషన్ పరిధిలో గల డిఫెన్స్ కాలనీ ఆర్ఎస్ ఫొటో స్టూడియో ఉంది. స్టూడియో ఓనర్ కమ్ ఫొటోగ్రాఫర్ మహ్మద్ సలీం. చూడడానికి చక్కగా ఉన్నాడు. కానీ బుద్ది మాత్రం గడ్డి తిన్నది. ఇదివరకు సంగతెంటో కానీ.. సోమవారం సాయంత్రం ఓ యువతి స్టూడియోకి వచ్చారు. ఫొటో దిగాలని వస్తే.. తీస్తానని సలీం నమ్మబలికాడు. మెల్లగా లోపలికి తీసుకెళ్లాడు. ఫొటో కోసమే కదా అని వెళితే.. లైంగికదాడి చేయబోయాడు.

photographer saleem misbehave a girl

సలీం చర్యతో యువతి విస్తుపోయింది. వెంటనే లోపలి నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. జరిగిన ఘటన గురించి తెలియజేయగా మందలించి వదిలేశారు. ఇంటికెళ్లాక జరిగిన దారుణం గురించి తన తల్లిదండ్రులకు యువతి తెలిపింది. ఆమె తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 ఏ, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+