దూసుకొచ్చిన రేవంత్ రెడ్డి..అరెస్ట్: ఆటోలో వచ్చిన జగ్గారెడ్డి: ప్రగతి భవన్ వద్ద టెన్షన్..టెన్షన్..!

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నంత పనీ చేసారు. పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెట్టినా..రేవంత్ ను పట్టుకోలేక పోయారు. రేవంత్ పోలీసుల కళ్లు గప్పి ప్రగతి భవన్ సమీపంలోకి చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఛలో ప్రగతి భవన్ కు పిలుపు ఇచ్చింది. దీంతో..అనేక మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. కాగా, రేవంత్ రెడ్డి కోసం రాత్రి నుండి పోలీసులు గాలిస్తున్నారు.

అయితే, పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడిన రేవంత్ రెడ్డి తన అనుచరలతో కలిసి నల్ల చొక్క ధరించి ఆకస్మికంగా ప్రగతి భవన్ సమీపంలోకి వచ్చారు. దీంతో..ఒక్క సారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆయన్ను అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో..రేవంత్ అనుచరులు పోలీసులను అడ్డుకొనే ప్రయత్నం చేసారు. అయినా.. రేవంత్ ముందకు చొచ్చుకెల్లేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున పోలీసులు రేవంత్ ను చుట్టుముట్టి..అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి స్వయంగా నినాదాలు చేసారు.

ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. ఇప్పుడు ప్రగతి భవన్ గేటు తాకామని..త్వరలోనే ప్రగతి భవన్ ను బద్దలు కొడతామని హెచ్చరించారు. రేవంత్ ను నిలువరించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ..కార్యకర్తలు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీపీ కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేసారు.

అదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమారుడితో కలిసి ఆటోలో ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. గమనించిన పోలీసులు వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మొహరించి..రేవంత్ తో పాటుగా జగ్గారెడ్డిని అరెస్ట్ చేసారు. అక్కడి నుండి తరలించారు. కాగా, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం తన అనుచరులతో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. అయినా పోలీసులు అడ్డుకున్నారు.

Police arrest congress MP Revanth reddy..arrested many congress leaders

కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా ప్రగతి భవన్ కు చేరుకొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొందరు కీలక నేతలు ఎక్కడ ఉన్నారనే దాని పైన పోలీసులు వాకబు చేస్తున్నారు. కోమటిరెడ్డి సైతం ప్రగతి భవన్ కు చేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రగతి భవన్ సమీపంలో పోలీసులు భారీ ఎత్తున మొహరించటంతో సికింద్రాబాద్ నుండి బేగం పేట్ వరకు ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+