పోలీసులకు చిక్కిన చెడ్డీగ్యాంగ్, ఇరానీ గ్యాంగ్..! హైదరాబాద్ లో ఇంకెన్నిరా బాబు?
హైదరాబాద్ : భాగ్యనగరంలో చోరీలతో బీభత్సం సృష్టిస్తున్న రెండు ముఠాల ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. సంక్రాంతి సందర్భంగా తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అందినకాడికి దోచుకున్న సదరు గ్యాంగులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీసుల దృష్టి మళ్లించి దోపిడీలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్ ను కూడా పట్టుకున్నారు. ఈ రెండు ముఠాల నుంచి పెద్దమొత్తంలో నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మొత్తానికి పండుగ వేళ వరుస దొంగతనాలతో బీభత్సం సృష్టించి పోలీసులకు సవాల్ విసిరిన చెడ్డీగ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ఆట కట్టించడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. దొంగతనాల సమయంలో తమకు అడ్డొచ్చినవారిని చెడ్డీగ్యాంగ్ సభ్యులు తీవ్రంగా గాయపరుస్తారు. హైదరాబాద్ లో పలుచోట్ల రెచ్చిపోయిన చెడ్డీగ్యాంగులు పోలీసుల కళ్లుగప్పి కొంతకాలంగా తప్పించుకుంటున్నాయి. అయితే చెడ్డీగ్యాంగ్ ఒకటి తాజాగా పట్టుబడటంతో నగరంలో ఇంకెన్ని గ్యాంగులు సంచరిస్తున్నాయనే కోణంలో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications