శంషాబాద్‌.. సిద్దుల గుట్ట మహిళ శవంపై క్లారిటి ఇచ్చిన పోలీసులు

శంషాబాద్ సిద్దుల గుట్ట రోడ్డులోని మైసమ్మ గుడి వద్ద మరో గుర్తు తెలియని మహిళ మంటల్లో ఆహుతి అయిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే... ఘటన సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాధమిక అంచనాను బట్టి, ఆత్మహత్యగా పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టంకు పంపించి దర్యాప్తు చేస్తున్నారు.

పూజారితో మాట్లాడిన మహిళ

పూజారితో మాట్లాడిన మహిళ

సాయంత్రం సమయంలో ఆమె ఓ బ్యాగ్‌తో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిందని, అనంతరం గుడి పూజారీతో మాట్లాడినట్టుగా చెబుతున్నారు. అయితే ఆమె హిందీలో మాట్లాడడంతో పూజారీకి సరిగా అర్థం కాలేదని చెప్పారు. అయితే ఆమె ఏడుస్తూ కనిపించిందని చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక హిందీ మాట్లడడంతో ఉత్తరాదీ రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఆమె వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

కలకలం రేపిన మహిళ మృతదేహం

కలకలం రేపిన మహిళ మృతదేహం

డాక్టర్ ప్రియాంక రెడ్డి మరణంపై ఉత్కంఠ వీడకముందే మరోవైపు శంషాబాద్‌లో మరో దారుణ సంఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే.... ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం జరిగి సంచలనం సృష్టించిన కొద్ది గంటల్లోనే మరో మహిళ మంటల్లో కాలుతూ కనిపించడం పోలీసులకు సవాల్‌గా మారింది.. శంషాబాద్ సమీపంలోని సిద్దుల గుట్ట రోడ్డులో మైసమ్మ గుడి ప్రహరీ గోడ వద్ద మంటల్లో కాలిపోయిన ఉన్న గుర్తు తెలియని మహిళ శవాన్ని స్థానికులు గుర్తించి రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలీసులకు 100 ద్వార సమాచారం అందించారు.

అనుమాదస్పద మృతిగా కేసు నమోదు

అనుమాదస్పద మృతిగా కేసు నమోదు

దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. వెంటనే క్లూస్ టీంను పంపించారు. సంఘటనా స్థలాన్ని పరీశీలించారు. అయితే రక్తపు మరకలతో పాటు, ఒక ప్లేటు కూడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని సాక్ష్యాలను సేకరించారు. మృతురాలికి చెందిన కొన్ని కొన్ని వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. అనుమాదస్పద మృతిక్రింద కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+