Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీస్, ప్రెస్ స్టిక్కర్ల వాహనాలకు బ్రేక్.. రెండోసారి చిక్కితే అంతే..!

హైదరాబాద్ : బండ్లపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు అతికించుకుని హైదరాబాద్ రోడ్లపై దూసుకెళుతున్నారా? పోలీస్ కాకున్నా, విలేకరిగా పనిచేయకున్నా.. ఆ స్టిక్కర్లేసుకుని యమ దర్జాగా వాహనాలు నడుపుతున్నారా? అయితే జాగ్రత్త. ఇకపై పోలీసులు అలాంటి వాహనదారులకు చెక్ పెట్టనున్నారు. స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటికే వందల మంది అసలు సిసలు కాని పోలీసులు, విలేఖరులు అడ్డంగా దొరికిపోయారు. ఫస్ట్ టైమ్ వార్నింగ్ తో సరిపెట్టినా.. మరోసారి రిపీట్ అయితే మాత్రం ఊచలు లెక్కపెట్టాల్సిందే.

పోలీస్, ప్రెస్.. సగం వాహనాలు అవేనా?

పోలీస్, ప్రెస్.. సగం వాహనాలు అవేనా?

హైదరాబాద్ మహానగరంలో వాహనాలు వేల సంఖ్యలో ఉంటాయి. అందులో పోలీస్, ప్రెస్ స్టిక్కర్లున్న బండ్లు కొకొల్లలు. టూ వీలర్ నుంచి మొదలుపెడితే కాస్ట్లీ కార్ల వరకు ఆ స్టిక్కర్లు కనిపిస్తాయి. వాస్తవానికి అసలైన పోలీసులు గానీ, విలేఖరులు గానీ చాలామంది వారి వాహనాలకు అలాంటి స్టిక్కర్లు వేసుకొని పరిస్థితి. అయితే కొందరు ఖాకీ ఉద్యోగం వెలగబెట్టకున్నా, విలేకరులుగా పనిచేయకున్నా.. దర్జాగా పోలీస్, స్టిక్కర్లు వేసుకుని భాగ్యనగరం రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు.

ఎవరు అసలు పోలీసులో, ఎవరు అసలు విలేకరులో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు స్టిక్కర్ల భాగోతంపై దృష్టి పెట్టారు. ఇటీవల కొన్ని పోలీస్ స్టిక్కర్ తో ఉన్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా.. వారికి డిపార్టుమెంటుతో సంబంధం లేదనే విషయం బయటపడింది. దాంతో సదరు వాహనదారుల నుంచి తప్పయిందనే సంజాయిషీ పత్రం రాయించుకొని.. మరోసారి ఇది రిపీట్ కాబోదంటూ హామీ తీసుకుని వదిలేశారు పోలీసులు.

 ఫస్ట్ వార్నింగ్.. రెండోసారి చిక్కితే కేసు

ఫస్ట్ వార్నింగ్.. రెండోసారి చిక్కితే కేసు

పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు అతికించుకుని దర్జాగా తిరుగుతున్న నకిలీలను అరికట్టేలా 3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వృత్తితో సంబంధం లేకుండా దాదాపు 300 మంది పట్టుబడటం పోలీస్ శాఖను విస్మయపరిచింది. మొదటిసారి కాబట్టి వార్నింగ్ తో సరిపెట్టారు. రెండోసారి ఆ స్టిక్కర్లతో చిక్కితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలను తనిఖీలు చేసేటప్పుడు, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ సమయంలోనూ పోలీస్, ప్రెస్ స్టిక్కర్లున్న వాహనాలను ఆపి ఐడీ కార్డులు అడిగితే తెల్లముఖం వేస్తున్నారట చాలామంది. గతేడాది హవాలా రాకెట్ లో దొరికిన ఓ వ్యక్తి తనకు తానుగా ప్రెస్ ఐడీ కార్డు ముద్రించుకోవడం గమనార్హం.

అక్రిడిటేషన్ ఉంటే ఓకే

అక్రిడిటేషన్ ఉంటే ఓకే

ప్రెస్ స్టిక్కరుంటే చాలామటుకు పోలీసులు ఆపరు. విధినిర్వహణలో వారికి ఇబ్బందులు కలిగించడం ఎందుకని ఊరుకుంటారు. కానీ అసలు కన్నా కొసరెక్కువ అన్నట్లు తయారయింది ఈ ప్రెస్ స్టిక్కర్ల గోల. కొన్ని సందర్భాల్లో ఉత్తుత్తి గుర్తింపు కార్డులతో విలేకరులమంటూ పోలీసులను దబాయిస్తుంటారు కొందరు. అందుకే నకిలీల బెడద తప్పించేందుకే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు పోలీసులు. విలేకరులకు ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డు ఉంటే.. ప్రెస్ స్టిక్కర్లకు అభ్యంతరం లేదంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+