పనిచేయని పోలీస్ రిక్రూట్ మెంట్ పేజీ.. అభ్యర్థుల ఆందోళన, రేపే లాస్ట్ డేట్

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌కు రేపటితో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. ఆఫ్లై చేసుకునే వారు చేస్తూనే ఉన్నారు. అయితే పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ పనిచేయడం లేదని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నిస్తే వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయడం లేదంటున్నారు.

police recruitement page is not worked

దరఖాస్తులకు రేపే చివరి రోజు.. ఎక్కువ సంఖ్యలో అప్లై చేసేందుకు క్యాండిడేట్స్ ప్రయత్నిస్తున్నారు. వెబ్‌సైట్ సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో దరఖాస్తుల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, వెబ్‌సైట్ త్వరగా పనిచేసేలా చూడాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొత్తం 16 వేల 614 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

ఇప్పటివరకు ఎనిమిది లక్షల వరకు దరఖాస్తులు రాగా, నాలుగు లక్షలకుపైగా అభ్యర్థులు అప్లై చేశారు. ఆగష్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్స్ రాత పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల సమస్యలపై 12 వేల వరకు హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్స్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రతీ ఒక్క అభ్యర్థి తాను పోలీసు అవుతాననే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్నాడు. ఇంతలో టెక్నికల్ ప్రాబ్లమ్ హైరానా పెట్టిస్తోంది. దరఖాస్తు చేయడానికి కూడా ఒక్కరోజే సమయం ఉండటంతో.. గడువు పొడగించాలనే డిమాండ్ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+