పొలిటికల్ టూరిస్టుల కామెంట్ల కలకలం, కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్, ఇచ్చింది కాంగ్రెస్సే..
ఓరుగల్లు వేదికగా రాహుల్ గాంధీ బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. జన సమీకరణలో కాంగ్రెస్ శ్రేణులు సక్సెస్ అయ్యారు. అయితే విపక్షాల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు పర్యటిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా సింగిల్ లైన్‌తో కూడిన ఓ ఆసక్తికర ట్వీట్ పోస్ట్ చేశారు. అదీ రాజకీయంగా ప్రకపంనలు రేపింది.

టూరిస్ట్ ప్లేసా..?
పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు, వెళుతుంటారన కేటీఆర్ రాసుకొచ్చారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణలో నిలబడతారని ట్వీట్ చేశారు. దీంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చారు. కేటీఆర్ ట్వీట్‌ను కోట్ చేస్తూ దానికి రీ ట్వీట్ పోస్ట్ చేశారు. తెలంగాణకు టూరిస్టులు వస్తుంటారు, వెళుతుంటారు అంటూ కేటీఆర్ శుక్రవారం రాత్రి ట్వీట్ చేయగా.. కేటీఆర్ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చంటూ కీలక వ్యాఖ్య చేశారు.

అమరవీరుల త్యాగఫలం
తెలంగాణను కేటీఆర్ టూరిస్ట్ ప్లేస్‌గా పరిగణిస్తుంటే... తాము మాత్రం ఈ రాష్ట్రం అమర వీరుల త్యాగ ఫలంగానే భావిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం తెలంగాణ రాష్ట్రం అని పేర్కొన్నారు. కేటీఆర్ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా, దానిని సృష్టించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని రిప్లై ఇచ్చారు. ఇదీ కేటీఆర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

నడ్డా.. తర్వాత రాహుల్
తెలంగాణలో బీజేపీ అగ్ర నేతలు కూడా పర్యటిస్తున్నారు. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర తొలి దశ ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నడ్డా హాజరయ్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరంగల్‌లో టీపీసీసీ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభకు హాజరైన రాహుల్... శనివారం హైదరాబాద్‌లో ఉంటారు. నడ్దా, రాహుల్‌ల టూర్ నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఘాటైన రిప్లై వచ్చింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications