pk love:పూనమ్ కౌర్ సంచలనం.. ట్వీట్‌తో రచ్చ రచ్చ... ఇంతకీ పీకే లవ్ అంటే..?
పూనమ్ కౌర్.. నటి... యాక్టర్‌గా గుర్తింపు సంగతి ఏందో కానీ.. ఇటీవల కాంట్రవర్సీకి మాత్రం ఆమెనే వేదిక అయ్యారు. స్టార్ నటుడు మోసం చేశాడని.. ప్రెగ్నెంట్ చేసి.. రూ.5 కోట్లు ఇచ్చారని పేరు యుక్తంగా కామెంట్ చేశారు. పోసానితో మొదలైన వివాదం సమసిసోయినట్టే అనిపించింది. కానీ దానికి పూనమ్ ఆజ్యం పోశారు. తాజాగా సోషల్ మీడియా ట్విట్టర్‌లో కాంట్రవర్సీ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆమె చేసిన పోస్ట్ కామనే అయి ఉండొచ్చు.. ఆమె పేరుకు కలిసి ఉండొచ్చు కానీ.. ప్రస్తుత పరిస్థితులకు మాత్రం సరిపోదు.

పీకే లవ్..
పీకే లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో నటి పూనమ్ కౌర్ పోస్ట్ చేశారు. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానికి పీకే లవ్ అని రాయడం చర్చకు దారితీసింది. ట్రెడిషనల్ లుక్‌లో కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పీకే లవ్ అంటూ ట్యాగ్ చేసింది. దీంతో దీని అర్ధం ఏమై ఉంటుందో అని మళ్ళీ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్ధం కూడా వస్తుంది. కానీ నెటిజన్లు మాత్రం అదొక్కటే కాదు అని మరేదో అయి ఉంటుందని అర్ధాలు తీస్తున్నారు. నిజానికి పీకే అంటే ఆమె పేరుతో పాటు.. పవన్ కల్యాణ్ కూడా వస్తోంది. ఇటీవల పవన్ పేరుతోనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

అన్యాయం..
నిజానికి చాలాకాలంగా ప్రేమ విషయంలో పూనమ్ కౌర్‌కు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో డిస్కస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూనమ్ చిత్ర పరిశ్రమలో తన ఏకైక గురువు దాసరి నారాయణ రావు అని. ఆయనను చాలా మిస్సవుతున్నానని చెప్పారు. దాసరి గారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నా... దేవుడు దీనిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారగా.. ఎప్పటికప్పుడు ఆమె చేసే ట్వీట్ అలెర్ట్ అయ్యేలా చేస్తున్నాయి.

ప్రకాశ్ గెలిస్తే..
ఇటీవల మా ఎన్నికలలో కనుక ప్రకాష్ రాజ్ గెలిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడతానని అని చెప్పారు. ప్రకాష్ గెలిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా బయటపెట్టే ధైర్యం వస్తుందనేలా మరో ట్వీట్ చేసింది. దీంతో పూనమ్‌కు జరిగిన అన్యాయం ఏంటి.. అసలు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు అనే చర్చ సహజంగానే మొదలైంది. అదలా ఉండగానే ఇప్పుడు పీకే లవ్ అంటూ ఆమె పెట్టిన ట్వీట్ కూడా మరోసారి సంచలనంగా మారింది.

ఇదీ నేపథ్యం
సినిమా టికెట్లకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లతో అగ్గి రాజుకుంది. సీఎం జగన్ లక్ష్యంగా కామెంట్లు చేయగా.. పోసాని కృష్ణమురళి సీన్ లోకి వచ్చారు. నానా రచ్చ చేశారు. పవన్.. కడుపు చేశారని కామెంట్స్ చేశారు. తర్వాత పవన్- పోసాని మధ్య మాటల యుద్దం జరిగింది. ఇప్పుడిప్పుడే గొడవ సద్దుమణిగింది అనుకునే లోపు.. పూనమ్ కౌర్ బాంబు పేల్చారు. మరీ ఇదీ ఎంతవరకు దారితీస్తుందో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications