పెద్దల సభకు ప్రకాశ్ రాజ్..? టీఆర్ఎస్ నుంచి ఛాన్స్, గులాబీ దళపతి లెక్కలు ఇవే..?
ఇటీవల మహారాష్ట్ర ఉద్దవ్ థాకరేను సీఎం కేసీఆర్ బృందం కలిసిన సంగతి తెలిసిందే. అందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ దర్శనం ఇచ్చారు. ఆయన ఇలా అని చర్చ జరిగింది. దానికి తగినట్టు ఓ ప్రచారం జరుగుతుంది. అదే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనను రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రకాశ్‌రాజ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దక్షిణాదితోపాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రకాశ్‌రాజ్ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో అభిమానులు ఉన్నారు. బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

3 సీట్లు ఖాళీ..
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒక స్థానంలో ప్రకాశ్ రాజ్ కు అవకాశం కల్పిస్తే జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం ఉంటుంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండగా.. జూన్‌లో మరో ఇద్దరు డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం ముగియనుంది. 3 స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని ప్రకాశ్‌రాజ్‌కు ఇచ్చే యోచనలో గులాబీ బాస్ ఉంది.

ప్రకాశ్ రాజ్ ఒకరు..
బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ప్రముఖుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. తొలి విడత ఎన్డీయే సర్కార్ ఏర్పడిన తర్వాత సైద్ధాంతికంగా ఆ పార్టీ విధానాలను విభేదిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి గులాబీ పార్టీతో టచ్‌లో ఉన్న ప్రకాశ్ రాజ్ ఆ సంబంధాలను కంటిన్యూ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు నినాదాన్ని అందుకోవడంతో అప్పుడు ప్రకాశ్‌రాజ్ మద్దతు తెలిపారు.

ముంబైలో ఇలా.. కర్ణాటకలో అప్పుడు
ముంబై పర్యటనలో మరోసారి కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయిన టీమ్‌లో ప్రకాశ్‌రాజ్ ఉన్నార. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రకాశ్‌రాజ్ మూడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. గతంలో గులాబీబాస్ కర్ణాటకలో పర్యటించిన సమయంలో మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అయ్యారు. అప్పుడు కూడా ప్రకాశ్‌రాజ్ ఉన్నారు. సో వీరి క్లోజ్ నెస్ చాలా రోజుల నుంచి ఉంది. అదీ ఇప్పుడు మరింత బలపడి.. పదవీ ఇచ్చేందుకు దోహదపడనుంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications