TSPSC Paper Leak: స్వ్కాడ్‍గా వెళ్లి అమ్మాయికి ఏఈ పేపర్ కీ ఇచ్చిన ప్రవీణ్..!
ఏఈ పేపర్ లీక్ తో టీఎస్‍పీఎస్సీ సర్దుబాటు చర్యలు చేపట్టింది.
టీఎస్‍పీఎస్సీ పేపర్ల లీక్ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఏఈ పేపర్ లీక్ తో వేలాది మంది నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు. అయితే ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో ఏఈ పేపర్ తోపాటు మరో రెండు ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీఎస్‍పీఎస్సీ అధికారుల తీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏఈ పరీక్షను రద్దు చేసిన టీపీఎస్పీఎస్సీ.. తిద్దుబాటు చర్యలు చేపట్టింది.
టీఎస్పీఎస్సీలో పని చేసే అధికారుల విధులను మార్పు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఒకే విభాగంలో పని చేస్తున్న 20 మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు మార్చినట్లు సమాచారం. కాన్ఫిడెన్షియల్, లీగల్, ఐటీ టీఎస్పీఎస్సీలో ప్రధాన విభాగాలుగా ఉన్నాయి. వీటికి ఉన్నతాధికారులను నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం అనుమతి కోరనున్నారు.

మరోవైపు పేపర్ లీక్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఓయూలో విద్యార్థుల నిరసనలు మిన్నట్టాయి. విద్యార్థి సంఘాలు టీఎస్సీపీఎస్సీ అధికారుల తీరుపై మండిపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పేపర్ లీక్ అయినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ కేసును సిట్ విచారిస్తోంది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ పేపర్ ఎవరెవరికి లీక్ చేశారనే దాని దర్యాప్తు చేస్తున్నారు.
ఏఈ పరీక్ష మార్చి 5న జరిగిన ప్రవీణ్ ఓ పరీక్ష కేంద్రానికి స్కాడ్ గా వెళ్లి ఓ అమ్మాయికి కీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేణుకకు, ప్రవీణ్ కు 2018లోనే పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆమె గురుకుల హిందీ టీచర్ గా ఎంపికైనప్పుడు.. రేణుక పేరులో తప్పు దొర్లింది. దాన్ని సరి చేసుకునేందుకు ఆమె టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ తో రేణుకకు పరిచయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications