బొల్లారంలో గ్రాండ్‌గా ఎట్ హోం.. రాష్ట్రపతితో గవర్నర్, సీఎం, మంత్రులు.. రేపు ఢిల్లీకి కోవింద్

శీతాకాల విడిది ముగించుకుని శనివారం ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఇవాళ సాయంత్రం ఎట్ హోమ్ రిసెప్షన్ ఇచ్చారు. వేడుకలా సాగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

President Kovind hosted an At Home reception at Secunderabad Rashtrapati Nilayam

శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి.. 23న తమిళనాడు వెళ్లి, మళ్లీ గురువారమే నగరానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

President Kovind hosted an At Home reception at Secunderabad Rashtrapati Nilayam

ఏటా రాష్ట్రపతి శీతాకాలంలో దక్షిణాదికి విడిది కోసం వచ్చే ఆనవాయితీ ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ తమిళిసై శుక్రవారం మధ్యాహ్నం తేనేటి విందు ఏర్పాటుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+