Narendra Modi: ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం మహంకాళి ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మోడీకి అమ్మవారి ఫోటో ఫ్రేమ్‌ను బహుకరించారు.
నిన్న రాత్రి ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం పౌర విమానయాన రంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D) కార్యకలాపాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రధాని ప్రారంభిస్తారు.

రూ. 350 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక సదుపాయం 5-స్టార్-గృహ రేటింగ్, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాకు చేరుకుంటారు. 6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పటేల్ గూడలోని ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల వద్ద బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
ప్రధాని రాక సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.బీజేపీ ఇప్పటికే తెలంగాణకు సంబంధించి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అర్వింద్, మాధవి లత, భరత్, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించారు.

ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, పెద్దపల్లి, నల్గొండకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ కూడా నలుగురు అభ్యర్థులన ప్రకటించింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, మహబూబాబాద్ నుంచి కవిత, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నామ నాగేశ్వర రావు పేర్లను ఖారారు చేసింది. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications