కాసుల కోసం కార్పొరేట్ ఆస్పత్రి కక్కుర్తి.. కరోనా పేరుతో రూ.32 లక్షల బిల్లు వసూల్..
కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి. వైరస్ ఉన్నా లేకున్నా కొన్ని దవాఖానాలు ముక్కు పిండీ మరీ డబ్బులు వసూల్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనే మరొటి వెలుగుచూసింది. అయితే ఈసారి ఏకంగా రూ.32 లక్షల బిల్లును సదరు ఆస్పత్రి వసూల్ చేసింది. అయితే అతనికీ వైరస్ లేకపోవడం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్ కాగా.. ఆస్పత్రి యజమాన్యం కూడా స్పందించింది.
హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకం వెలుగుచూసింది. ఓ రోగిని 30 రోజులకు చికిత్స అందించింది. కరోనా పేరు చెప్పి రూ.32 లక్షలు గుంజింది. కరోనా లేకున్నా బిల్లు వేశారంని నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యం స్పందించింది. పేషెంట్ తీవ్ర అనారోగ్యం బారిన పడి తమ ఆస్పత్రికి వచ్చాడని పేర్కొన్నది. నెల రోజులుగా చికిత్స అందించామని వివరించింది. ఇంకా పలు కారణాలను ఎక్స్‌ప్లేన్ చేసింది.

అతనికి న్యుమోనియా వచ్చిందని వివరించింది. పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ అని వచ్చిందని.. కానీ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నది. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడమే గాక.. రెండు కిడ్నీలు పనిచేయడం లేదని తెలిపింది. డయాలసిస్ చేస్తూ వెంటిలేటర్‌పై చికిత్స అందించామని.. రోగి పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నది.
ఇదివరకు కూడా సిటీలో ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఓ పేషెంట్‌కు ఐదు రోజుల చికిత్స చేసి రూ.3.4 లక్షల బిల్లు వేసింది. పేషెంట్‌తోపాటు వచ్చిన వ్యక్తి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కరోనా పేషెంట్‌కు వేసిన బిల్లుగా ప్రచారం జరగగా.. ఆ పేషెంట్‌కు కరోనా లేదని తెలిసింది. ఊపిరితిత్తుల సమస్య ఉందని, బిల్లు విషయంలో పేషెంట్ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపింది. తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications