హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు... గెస్ట్ హౌస్‌లో పట్టుబడ్డ యువతులు,విటులు...
హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచారం చేస్తున్న యువతులు,విటులను అరెస్ట్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో చైతన్యపురిలో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠాపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

షేక్‌పేట్ ఓయూ కాలనీ గెస్ట్ హౌస్...
గోల్కొండ పోలీసుల కథనం ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్‌పేట్ ఓయూ కాలనీలో ఓ గెస్ట్ హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు. గెస్ట్ హౌస్ ఎదుట ఓ సెక్యూరిటీ గార్డును నియమించాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం(ఏప్రిల్ 14) రాత్రి గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు యువతులు,ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. గెస్ట్ హౌస్ వాచ్‌మెన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.4వేలు నగదు 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యభిచార దందా నడిపిస్తున్న మున్నాభాయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

చైతన్యపురిలో మరో వ్యభిచార ముఠా...
మరో ఘటనలో చైతన్యపురిలో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠాపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ,తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మానస,మల్లిఖార్జున్ తమ అదుపులో ఉన్నారని...పోకల లింగయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

రెండు రోజుల క్రితం మాదాపూర్‌లో...
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోనూ ఓ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ టీమ్ హోటల్‌పై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు,ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు,ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హోటలో గదిలో రూ.29,560 నగదు, కండోమ్ ప్యాకెట్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications