Telangana strict lockdown: వారందరినీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు తరలింపు..గేట్లకు తాళం

హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్‌డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల రోజువారీ సంఖ్యను మరింత నియంత్రించేలా రాష్ట్రవ్యాప్తంగా ఈ 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తోంంది. రోడ్ల మీదికి వచ్చిన వారెవ్వర్నీ పోలీసులు ఉపేక్షించట్లేదు. వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తోన్నారు. జరిమానాలను విధిస్తోన్నారు.

నిత్యావసర సరకుల కొనుగోలు చేయడానికి తెల్లవారు జామున 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత కూడా రోడ్ల మీద కనిపించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో పోలీసులకు సర్వ హక్కులను ఇచ్చింది. ఎవ్వరినీ ఉపేక్షించవద్దంటూ ఆదేశాలను ఇచ్చింది. కోవిడ్ ప్రొటోకాల్స్, లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు భిన్నంగా ప్రవర్తించే వారి పట్ల హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపిస్తోన్నారు.

Public who were roaming on roads without proper reason lock up in in HPS

సరైన కారణం లేకుండా రోడ్ల మీద తిరిగే వారిని పట్టుకొచ్చి బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) ఆవరణలో వదిలేశారు. గేట్లకు తాళం వేశారు. ఏ ఒక్కరు కూడా సరైన కారణాన్ని చూపించట్లేదని వెల్లడించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఒకవంక కఠినంగా లాక్‌డౌన్ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు వాహనదారులు అకారణంగా రోడ్ల మీదికి వస్తున్నారని చెప్పారు. అలాంటి వారందరినీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు తరలించారు. ఆవరణలో వదిలేసి, గేట్లకు తాళం వేశారు. అనంతరం వారిని ఒక్కొక్కరిగా వదిలేస్తామని వెల్లడించారు.

ప్రజల సహకారం ఉంటేనే లాక్‌డౌన్ విజయవంతమౌతుందని, దీనిపై తాము అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా అవగాహనను కల్పించే ప్రయత్నం చేస్తున్నామని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా అకారణంగా ఎవ్వరూ రోడ్ల మీదికి రావొద్దంటూ ప్రధాన మీడియాతో పాటు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం చేస్తోన్నామని, అయినప్పటికీ కొందరు బేఖాతర్ చేస్తోన్నారని అంటున్నారు. మరో పదిరోజుల పాటు కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+