హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడురోజులు వర్షం.. చలిగాలులతో జనం ఉక్కిరి బిక్కిరి

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలిగాలులు వీస్తున్నాయి. అసలే చలికాలం.. ఆపై గాలులతో వృద్దులు, పిల్లలు వణుకుతున్నారు. సంక్రాంతి ముందట చలి కూడా ఎక్కువే ఉంటుంది. వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో శని, ఆది, సోమవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు.

ఆగ్నేయ దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల కారణంగా చలితీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉత్తరభారతం నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా మంచు పొరలు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

rain alert:three days rain in telangana state

ప్రధానంగా అదిలాబాద్, కుమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాలలో జనవరి 10, 11న వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరో వైపు ఉత్తరభారతాన్ని మంచుదుప్పటి కమ్మేసింది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదు అయింది.

కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. చలి కాలంలో కూడా ఎక్కువే వస్తున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంతటా పాకింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు వస్తున్నాయి. అయితే బులెటిన్ మాత్రం ఒమిక్రాన్ కోసం ప్రత్యేకంగా ఇవ్వబోం అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.

English summary
rain alert:three days rain in telangana state hyderabad weather officials said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X