• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎంఐఎం నేతలకు భయపడుతున్నారా.. హైదరాబాద్ పాకిస్థాన్‌లో ఉందా.. రాజా సింగ్ నిప్పులు (వీడియో)

|

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. పంద్రాగస్టు వేడుకలను కూడా ఘనంగా జరుపుకోలేని పరిస్థితి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలో ప్రజలే చెప్పాలని కోరారు. సీఎం కేసీఆర్ 8వ నిజాం రాజుగా అవతరించారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రినా మనం ఎన్నుకున్నదంటూ ధ్వజమెత్తారు. దేశ ఔన్నత్యాన్ని చాటేలా తిరంగా యాత్ర చేపడితే పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తెలంగాణలో రజాకార్ల రాజ్యం.. రాజా సింగ్ ఫైర్..!

తెలంగాణలో రజాకార్ల రాజ్యం.. రాజా సింగ్ ఫైర్..!

తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సంబరాలు జరుపుకుంటుంటే.. తెలంగాణలో మాత్రం మరోసారి రజాకార్ల రాజ్యం కనిపిస్తోందని ఫైరయ్యారు. దేశం యావత్తూ పంద్రాగస్టు వేడుకల్లో నిమగ్నమైతే తెలంగాణలో మాత్రం చీకటి రోజులు కనిపించాయని ఎద్దేవా చేశారు.

పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు తిరంగా యాత్ర చేపడితే.. పోలీసులు అడ్డుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దేశ ఔన్నత్యాన్ని చాటుతూ మువ్వన్నెల జెండాతో ప్రదర్శన చేపడితే అడ్డుకుంటారా అని ఫైరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బీజేపీ కార్యకర్తలు తిరంగా యాత్ర చేపట్టారని.. ఆ క్రమంలో పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.

వామ్మో కిడ్నాప్.. పోలీసుల ఉరుకులు పరుగులు.. రాక్షసుడు సినిమా చూసి చివరకు..!

తిరంగా యాత్రను అడ్డుకుంటారా.. హైదరాబాద్ పాకిస్థాన్‌లో ఉందా..!

చార్మినార్ దగ్గర బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు అటువైపు వెళ్లడానికి వీల్లేదంటూ ఆపడం సరికాదన్నారు రాజా సింగ్. తిరంగా యాత్రను నిలువరించి బీజేపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే తనకు సిగ్గేస్తుందన్నారు. అసలు తెలంగాణ ఇండియాలో ఉందా.. హైదరాబాద్ బారతదేశంలో ఉందా లేదంటే పాకిస్థాన్ లో ఉందా అంటూ ప్రశ్నించారు. తిరంగా యాత్ర వల్ల పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటో తనకు అర్థం కాలేదన్నారు.

ఎంఐఎం నేతలకు భయపడ్డారా..!

ఎంఐఎం నేతలకు భయపడ్డారా..!

చార్మినార్ ప్రాంతంలో ఎవరైనా టెర్రరిస్టులు ఉంటారా లేదంటే పాకిస్థానీలు ఉంటారా అని ప్రశ్నించారు. లేకుంటే ఎంఐఎం నేతలకు భయపడి తిరంగా యాత్రను అడ్డుకున్నారా.. బీజేపీ జెండాలు లేవు, కాషాయం అంతకన్నా లేదు.. మరి అలాంటప్పుడు తిరంగా యాత్రను ఎలా ఆపుతారని ప్రశ్నించారు.

భారతదేశం ఔన్నత్యాన్ని చాటే జాతీయ జెండాను పట్టుకుని తిరంగా యాత్ర చేస్తుంటే ఎందుకు ఆపారని ఫైరయ్యారు.

తిరంగా యాత్ర చేపడితే కేసులా..!

తిరంగా యాత్ర చేపడితే కేసులా..!

శాంతియుతంగా తిరంగా యాత్ర చేస్తుంటే బీజేపీ కార్యకర్తలను ఆపడమే గాకుండా వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని మండిపడ్డారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత చాలాసేపు అక్కడే ఉంచుకుని చివరకు వదిలిపెట్టారని ఆరోపించారు. కేసులు కూడా పెడతారేమోనని సందేహం వ్యక్తం చేశారు. పోయినేడాది తాము చేపట్టిన తిరంగా యాత్రకు సంబంధించి ఇప్పుడు కేసులు పెట్టేలా నోటీసులు ఇస్తున్నారు. రెండు రోజుల కిందటే తనకు నోటీస్ వచ్చిందని చెప్పారు. తిరంగా యాత్ర చేపడితే కేసులు పెడతామన్న ధోరణిలో పోలీసులు భయపెడుతున్నారని ఆరోపించారు.

వ్యభిచారం వయా వాట్సాప్.. హైదరాబాద్‌లో కాదు ఆ జిల్లాలో..!

8వ నిజాం రాజు.. ఎంఐఎంకు గులాంగిరీ..!

8వ నిజాం రాజు.. ఎంఐఎంకు గులాంగిరీ..!

సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజా సింగ్. ఆయన్ని ఎనిమిదవ నిజాం రాజుగా అభివర్ణించారు. మనం ఎలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామో ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. ఎంఐఎంకు గులాంగిరీ చేసే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని ఎద్దేవా చేశారు. అంతేకాదు నిజాం పాలన ఏవిధంగా ఉండేదో దానికి అనుగుణంగా కేసీఆర్ పాలన చూపిస్తున్నారని ఫైరయ్యారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మేల్కొవాలని పిలుపునిచ్చారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Goshamahal BJP MLA Raja singh once again opposed the Telangana government. He alleged that the Rajakar kingdom was running in Telangana. Raja Singh asked the state government, there is no situation which has not even celebrated the Independence day. CM KCR 8th Nizam king.. Raja Singh says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more