ఎమ్మెల్యే పదవీకి రాజీనామా తర్వాతే బీజేపీలోకి, తేల్చని రాజగోపాల్ రెడ్డి.. ఆగస్ట్ 7 వరకు..?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై సందిగ్దత కొనసాగుతోంది. ఆయనను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసి రావాలని కమల దళం నేతలు కోరారు. దీనిపై అనుచరులతో రాజగోపాల్ చర్చిస్తున్నారు. ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. దీంతో పార్టీ మార్పు అంశం కొలిక్కి రాలేదు. లేదంటే శుక్రవారం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండేది.

వారం సమయం కావాలట..
రాజగోపాల్‌రెడ్డి చేరికపై బీజేపీలో చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలకు రాజగోపాల్ మెలిక పెట్టారు. పార్టీలో చేరేందుకు మరో వారం సమయం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ అనుకుంటుంది.
రాజగోపాల్ రాజీనామాపై ఎటూ తేల్చకుండా బీజేపీ నేతలను గందరగోళ పెడుతున్నారు. ఆగస్ట్ 7 వరకు సమయం ఇవ్వాలని కోరారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని బీజేపీ అనుకుంటుంది.

చేరికలు.. కానీ
కొన్ని రోజులుగా చేరికల విషయంలో బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం పార్టీకి ఉన్న బలం సరిపోదని బీజేపీ భావిస్తోంది.ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న నాయకులను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాష్ట్ర నేతలకు అప్పగించారు. అప్పటివరకు కొనసాగిన చేరికల కమిటీ స్థానంలో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపామని బీజేపీ చెబుతున్నారు.

సంప్రదింపులు
ఇటు రాజగోపాల్ రెడ్డిని మొన్న భట్టి విక్రమార్క వెళ్లి చర్చలు జరిపారు. ఆ మరునాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కూడా చర్చలు జరిపారు. అయినా నో యూజ్.. ఇవాళ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. సమస్య ఉంటే.. మాట్లాడుకుందాం అని, పార్టీని వీడొద్దని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఫోన్ చేశారు.
రాజగోపాల్ రెడ్డి డిమాండ్ల గురించి దిగ్గీ రాజా అడిగారు. కానీ హస్తిన వెళ్లేందుకు రాజగోపాల్ రెడ్డి సుముఖంగా లేరని తెలుస్తోంది. నిన్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెన్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాణికం ఠాగూర్ సమావేశంలో పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా ఉండేందుకు చేయాల్సిన అంశాలపై మాట్లాడారు.












Click it and Unblock the Notifications