Rajamouli:జక్కన్నకు రుణపడి ఉన్న టాప్ స్టార్స్ వీరే..!
హైదరాబాద్: ఒకప్పుడు టాలీవుడ్ సినిమా అంటే కేవలం దక్షిణ భారతానికే పరిమితమయ్యేది. కానీ కాలక్రమంలో టాలీవుడ్ రూపురేఖలే మారిపోయాయి. ఏకంగా బాలీవుడ్‌నే బీట్ చేసే స్థాయికి మన తెలుగు ఇండస్ట్రీ ఎగబాకింది. ఎవడైతే నాకేంట్రా అన్న రేంజ్‌లో తెలుగు చిత్ర సీమ స్థిరపడింది.అయితే టాలీవుడ్ ఒకేసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం వెనక ఎవరి హస్తం ఉంది.. ఏ హీరోలు ఈ రేంజ్‌కు తీసుకెళ్లారు..? వారు ఎవరికి రుణపడి ఉండాలి
అవును..టాలీవుడ్ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిని తాకిందంటే అందుకు కారణం దర్శకధీరుడు రాజమౌళి అని టక్కున చెప్పక తప్పదు. రాజమౌళి ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. అంతేకాదు మునిగిపోతున్న హీరోల కెరీర్‌ను తిరిగి గాడినపెట్టి వారికి మరో లైఫ్ ఇచ్చాడని కూడా చెప్పొచ్చు. అలాంటి హీరోలు రాజమౌళికి ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ముందుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ గురించి మాట్లాడుకోవాలి. రాంచరణ్ తేజ్ రేంజ్ అంతర్జాతీయ స్థాయిని తాకిందంటే అందుకు కారణం రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అంతేకాదు రాంచరణ్ రంగస్థలం తర్వాత తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్టును రాంచరణ్ టేకప్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. కాబట్టి రాంచరణ్ రాజమౌళికి రుణపడి ఉండాలనే చర్చ జరుగుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు పాన్‌ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిందంటే అందుకు కారణం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం. ఈ చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ రేంజ్ మామూలుగా పెరగలేదు. అంతకుముందు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఛత్రపతితో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ప్రభాస్.ప్రభాస్‌కు మళ్లీ అంతటి క్రేజ్ వచ్చిందంటే కచ్చితంగా రాజమౌళి పేరు చెప్పుకోవాల్సిందే.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా జక్కన్నతో నాలుగు చిత్రాలు చేశారు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఈ కాంబో చేసింది. ఇవన్నీ ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. దీంతో జూనియర్ కెరీర్‌ను ఒకరకంగా జక్కన్న చెక్కాడనే చెప్పాలి. అందుకే రాజమౌళికి తానెప్పుడు రుణపడి ఉంటాడని పలు సందర్భాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పాడు.

ఇక నేచురల్ స్టార్ నానితో ఈగ చిత్రం చేశారు రాజమౌళి. నిడివి తక్కువగానే ఉన్నా నానికి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఇక కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో మాస్ మహారాజ్ రవితేజతో విక్రమార్కుడు చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు జక్కన్న.ఇది ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇలా రానా, తమన్నా వంటి వారు కూడా జక్కన్న చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications