రాజేంద్రనగర్ ఎమ్మెల్యేకు కరోనా.. టెస్ట్ చేయించుకోవాలని సన్నిహితులకు పిలుపు..

కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు యూకే నుంచి కరోనా వైరస్ స్ట్రెయిన్ టెన్షన్ మరోవైపు ఉంది. ఇటు కరోనా వైరస్ కేసులు కూడా అలానే ఉన్నాయి. ప్రముఖులకు కరోనా వైరస్ సోకుతూనే ఉంది. తాజాగా రాజేంద్ర నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ఎమ్మెల్యే తెలిపారు. గత నాలుగు రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

rajendranagar mla prakash goud infected corona

కరోనా వైరస్ కోసం చికిత్స చేయించుకుంటున్నానని.. కొద్దీ రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరు ఫోన్ చేయొద్దని కోరారు. తనను కలవటానికి ప్రయత్నించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భగవంతుడు, ప్రజల ఆశీస్సులతో త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని పేర్కొన్నారు. రెండో విడత కాస్తా కరోనా వైరస్ తగ్గినప్పటికీ మళ్లీ వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. అయితే రాష్ట్రంలో పదుల సంఖ్యలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డారు. కానీ వారంతా కరోనా నుంచి కోలుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+