రజనీకాంత్ హెల్త్ ఇజ్ స్టేబుల్.. రిపోర్ట్స్ అన్నీ నార్మలే..డిశ్చార్జీపై సాయంత్రం ప్రకటన..?

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. హై బీపీతో నిన్న జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిని రెండురోజులు మానిటర్ చేస్తామని వైద్యులు తెలిపారు. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్త బెటర్‌గా ఆరోగ్యంగా ఉంది అని తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. రజనీకాంత్ అనారోగ్యంగా ఉన్నారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఇష్ట దైవానికి ప్రార్థనలు చేస్తున్నారు.

Recommended Video

    #RajinikanthHealthCondition నిలకడగా రజినీ ఆరోగ్యం.. సాయంత్రానికి డిశ్చార్జ్..!?
     గతరాత్రి ఇబ్బందిగా.. ఇప్పుడు ఓకే..

    గతరాత్రి ఇబ్బందిగా.. ఇప్పుడు ఓకే..

    గత రాత్రి మాత్రం రజనీకాంత్ కాస్త ఇబ్బందికి గురయ్యారని అపోలో యాజమాన్యం బులెటిన్‌లో తెలిపింది. ఇప్పటికీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని వివరించింది. అయితే శుక్రవారంతో పోల్చితే బెటర్‌గా ఉందన్నారు. రజనీకాంత్‌కు చేసిన పరీక్షల్లో అన్నీ బాగానే ఉన్నాయని.. ఆందోళనకరంగా ఏ ఫలితాలు రాలేదన్నారు. ఇవాళ (శనివారం) మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫలితాలు సాయంత్రానికి వస్తాయని తెలిపారు.

    బీపీపై నిశీత పరిశీలన..

    బీపీపై నిశీత పరిశీలన..

    రజనీకాంత్‌ బ్లడ్ ప్రెషర్ అంశాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షిస్తున్నారని వివరించారు. బీపీ వల్ల పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించామని వెల్లడించారు. రజనీకాంత్‌ను సందర్శకులు కలవడానికి వీలు లేదని చెప్పారు. రజనీకాంత్‌కు చేసిన పరీక్ష ఫలితాలు, బీపీ ఎంతవరకూ కంట్రోల్ అవుతుందనే అంశాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. రజనీకాంత్‌ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అంశాన్ని సాయంత్రం తెలుపుతామని అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది.

     కరోనా రావడంతో వాయిదా..

    కరోనా రావడంతో వాయిదా..

    రెండు రోజుల క్రితం కరోనా వల్ల అన్నాత్తే మూవీ షూటింగ్‌ను వాయిదా వేశారు. షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రొడక్షన్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో షూటింగ్ నిలిపేశారు. ఆ సమయంలో రజనీకి కూడా కరోనా పరీక్ష చేయగా నెగటివ్ వచ్చింది. శుక్రవారం మరోసారి పరీక్ష చేయగా కూడా నెగటివ్ వచ్చింది. ఇటు రాజకీయ పార్టీ పెడతానని రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో.. రజనీ పార్టీ పెడితే.. అన్నాడీఎంకే, డీఎంకే కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కమల్ హాసన్ కూడా కలిసి పనిచేద్దామని కోరిన సంగతి తెలిసిందే. ఇంతలో రజనీకాంత్ అనారోగ్యానికి గురవడంతో ఫ్యాన్స్ టెన్షన్‌కు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+