హాస్పటల్ నుంచి ఉపాసన అంత త్వరగా ఎలా డిశ్చార్జి అయ్యారు?

ఇటీవలే రామ్ చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చిందనే వార్త జాతీయస్థాయిలో 5 రోజులు టాప్ లిస్టులో నిలిచిందంటే ఆ వార్తకు మీడియా ఎంత కవరేజ్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

జూన్ 20వ తేదీన ఆసుపత్రిలో చేరితో 23వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. వాస్తవానికి ప్రెగ్నెంట్ గా ఉన్న స్త్రీలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. వారికి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. కానీ ఉపాసన మాత్రం తన భర్త రామ్ చరణ్ తో కలిసి చలాకీగా నడుస్తూ వచ్చి ఆసుపత్రిలో చేరారు.

ramcharan wife upasana discharge secret

డిశ్చార్జ్ అయ్యే సమయంలో కూడా అంతే చలాకీగా తిరిగివెళ్లారు. ఉండటానికి ఆసుపత్రిలో మూడురోజులున్నారుకానీ గంటల వ్యవధిలోనే డిశ్చార్జ్ అయినట్లు లెక్క. బిడ్డ పుట్టిన తర్వాత రంగు గురించి, పోలిక గురించి, పేరు గురించి, జాతకం గురించి మాట్లాడుకున్నారు.. చర్చించుకున్నారు. అయితే అంత తొందరగా ఉపాసన ఎలా డిశ్చార్జ్ అయ్యారు? అనే విషయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు.

అపోలో ఆసుపత్రి ఆమెదే కాబట్టి త్వరగా డిశ్చార్జ్ అయి వచ్చేసిందనుకుంటారు. కానీ ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుంది. ఉపాసనకు ఉన్న ఆహారపు అలవాట్లవల్లే ఆమె అంత ఆరోగ్యంగా ఉన్నారు. డెలివరీ అయిన రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ కాగలిగారని ప్రముఖ వైద్యులు ఒకరు వీడియో ద్వారా తెలియజేశారు. ఉపాసన గతంలోనే తాను ఎటువంటి డైట్ తీసుకుంటాననే విషయాన్ని తెలిపారనే విషయాన్ని గుర్తుచేశారు.

* ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల వేడినీళ్లు తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక గ్లాస్ లెమన్ వాటర్ తాగుతుంది.
* తర్వాత బుల్లెట్ టీ తాగుతుంది.
* ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (ఉపవాసం).. తిన్న తరువాత 8 గంటల గ్యాప్.. ఆ తరువాత 16 గంటల గ్యాప్.
* ఉదయం తిన్న తరువాత 8 గంటల వరకూ మళ్లీ ఏమీ తినరు. రెండోసారి తిన్న తరువాత 16 గంటల గ్యాప్ ఉంటుంది. ఉదయం టిఫిన్ ఎక్కువగా తిని.. సాయంత్రం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఆ తర్వాత16 గంటల వరకూ మళ్లీ ఎటువంటి ఆహారం తీసుకోరు.
* డైట్‌లో మఖనా (లోటస్ సీడ్స్) కచ్చితంగా ఉంటాయి. వీటిల్లో ప్రొటీన్లు ఎక్కువ.
* తర్వాత పంప్‌కిన్ సీడ్స్ (గుమ్మడి గింజలు) తింటారు. వీటిలో మెగ్నీషియమ్ ఎక్కువ.
ఇవే ఉపాసన ఆరోగ్య రహస్యమని ప్రముఖ వైద్యులు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+