హైదరాబాద్‌లో రేవ్ పార్టీ- నిర్మాత సహా పలువురు అరెస్ట్
హైదరాబాద్: హైదరాబాద్ మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు, తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో సినీ నిర్మాత వెంకట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు దర్శకులు, టెక్నీషియన్లు డ్రగ్స్ దందాలో విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసు విచారణ కొలిక్కి వస్తోన్న సమయంలో ఇప్పుడు మళ్లీ తాజాగా రేవ్ పార్టీ ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మాదాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు, నార్కొటిక్స్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సినీ నిర్మాత వెంకట్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఎల్ఎస్‌డీ, కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీని ఎవరు నిర్వహించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తోన్నారు.

అరెస్టయిన వారిలో కొందరు సినీ నటులు సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వారి వివరాలను పోలీసులు, నార్కొటిక్స్ విభాగం అధికారులు ప్రస్తుతానికి గోప్యం ఉంచారని చెబుతున్నారు. అరెస్టయిన వారిని ఈ మధ్యాహ్నానికి మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications