Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మామిడితోటలో అర్ధరాత్రి.. మందు,విందు,పొందు.. పోలీసుల ఎంట్రీతో ఝలక్

హైదరాబాద్ : అసాంఘిక కార్యకలాపాలకు మామిడితోట వేదికైంది. నగరంలో ఐతే ఎంజాయ్ చేయరాదనుకున్నారో లేదంటే పోలీసుల బెడద ఉంటదనుకున్నారో గానీ మొత్తానికి అర్ధరాత్రి మామిడితోటలో చిందులేశారు కొందరు. రేవ్ పార్టీ పేరిట అర్ధనగ్న నృత్యాలు, వ్యభిచారానికి సిద్ధమయ్యారు. చివరకు పోలీసుల కంటపడటంతో గుట్టురట్టైంది. నలుగురు యువకులతో పాటు ఐదుగురు అమ్మాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పహాడీషరీఫ్ ప్రాంతానికి చెందిన హామీద్ ఖాన్ జల్‌పల్లి సమీపంలోని తనకు చెందిన మామిడితోటలో పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యాడు. శనివారం రాత్రి పార్టీ ఆరేంజ్ చేసి తన మిత్రులను ఆహ్వానించాడు. అయితే సంబరాలు ఘనంగా చేయాలనుకుని అడ్డంగా బుక్కయ్యాడు. మిత్రులను సంతోషపరిచేందుకు అమ్మాయిలను ఏర్పాటు చేశాడు. దీనికోసం డ్యాన్సర్ కమ్ ఈవెంట్ ఆర్గనైజర్ గా వ్యవహరిస్తున్న ఒక లేడీని సంప్రదించాడు. నలుగురు యువతులు కావాలని, డ్యాన్సులతో పాటు వ్యభిచారం చేసేలా ఉండాలని కోరాడు. ఒక్కొక్కరికి 15వేల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో నలుగురు యువతులతో పాటు తాను శనివారం రాత్రి మామిడితోటకు చేరుకుంది.

rave party in mango farm, 5 ladies and 4 gents were arrest

అర్ధరాత్రి 12-1 గంటల సమయంలో హామీద్ ఖాన్, ఆయన స్నేహితులు, ఐదుగురు యువతులు పెద్దగా సౌండ్ పెట్టుకుని అర్ధనగ్న డ్యాన్సులు చేస్తున్నారు. అయితే అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పహాడీషరీఫ్ పోలీసుల కంట పడింది ఈ తంతు. దీంతో వారందర్నీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమ్మాయిల్ని తుక్కుగూడలోని ప్రజావాలా హోమ్ కు తరలించినట్లు సమాచారం. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి నిందితులను రిమాండ్ కు పంపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+