మెరుగైన సమాజంలో కానరాని రవి ప్రకాశ్..! 9అలిగేషన్స్ విత్ RP..!!

హైదరాబాద్: రవిప్రకాష్‌పై నిధుల మళ్లింపు ఆరోపణలు రావడం మీడియా వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రవి ప్రకాష్‌పై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పీఎస్‌లో ఫోర్జరీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఐటీ యాక్ట్ 56, ఐపీసీ 406, 467 సెక్షన్ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా తెలంగాణ పోలీసుల గాలిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాష్‌ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం.

ఎన్నో వివాదాలను వెలికితీసిన రవి ప్రకాశ్..! తానే వివాదాల్లో ఇరుక్కున్న వైనం..!!

ఎన్నో వివాదాలను వెలికితీసిన రవి ప్రకాశ్..! తానే వివాదాల్లో ఇరుక్కున్న వైనం..!!

టీవీ9 వివాదం రోజురోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. అలంద కంపెనీ ప్రతినిధులు రవిప్రకాష్‌ను టీవీ9 సీఈవో పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించారు. టీవీ9 మొత్తం వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రవిప్రకాష్ కంపెనీ డేటాను బయటకు చేరవేసినట్లు అనుమానాలున్నాయని ఫిర్యాదులో వివరించారు.

సంచలనాల టీవి9..! రవి ప్రకాశ్ నే సంచలనంగా మార్చిన మీడియా..!!

సంచలనాల టీవి9..! రవి ప్రకాశ్ నే సంచలనంగా మార్చిన మీడియా..!!

టీవీ9 ఆఫీసులో 12 హార్డ్ డిస్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం రవిప్రకాష్ ఇంటికి పోలీసు బృందం వెళ్లింది. రవిప్రకాష్ భార్యకు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు అందజేశారు. శుక్రవారం పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. హీరో శివాజీకి కూడా పోలీసులు నోటీసులు అందజేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు.

రవిప్రకాష్‌పై ఆరోపణలు..! ఇంకా అందుబాటులోకి రాని ఆర్ పీ..!!

రవిప్రకాష్‌పై ఆరోపణలు..! ఇంకా అందుబాటులోకి రాని ఆర్ పీ..!!

టీవీ9 సంస్థ నిర్వహణలో వైఫల్యం, సంస్థ కీలక ఉద్యోగి కౌశిక్ రావు సంతకం ఫోర్జరీ ఆరోపణలతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీవీ9లో 8శాతానికి పైగా వాటా ఉన్న రవిప్రకాష్ 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందిపెడుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మెజారిటీ వాటాదారుల హక్కులను రవిప్రకాశ్ కాలరాస్తున్నారని కూడా కొత్త యాజమాన్యం ప్రధానంగా ఆరోపిస్తోంది. కొత్త డైరెక్టర్ల నియామకానికి కూడా రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది.

ఇవే వివాదాస్పద అంశాలు..! బయటపడే వెసులుబాటు ఉన్నట్టా..? లేనట్టా..?

ఇవే వివాదాస్పద అంశాలు..! బయటపడే వెసులుబాటు ఉన్నట్టా..? లేనట్టా..?

ఫైన్ వెంచర్ కాపిటలిస్ట్ ద్వారా సేకరించిన నిధులు టీవీ9కు శ్రీనిరాజు మళ్లించినట్లు ఆరోపణ. ఇది విదేశి పెట్టుబడి. ప్రతిపాదిత బిజినెస్‌కు కాకుండా వేరే అవసరాలకు నిధులు మళ్లించారంటూ ఆరోపణలు. నేషనల్ కంపెనీ లా ట్రిబునల్‌లో ఫైన్ వెంచర్ కేపటలిస్ట్ సంస్థ కేసు నమోదు చేసింది. టీవీ9 ఆస్తులను కొనుగోళ్లు చేయవద్దని, లా ట్రిబునల్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు ఉండగానే యాజమాన్యం బదిలీ చేసింది. కొన్నాళ్లుగా అలంద మీడియా సంస్థకు, రవిప్రకాష్‌కు మధ్య వివాదం మొదలైంది. టీవీ9ను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అలంద మీడియా కసరత్తు ముమ్మరం చేయడంతో కొత్త మలుపులు తిరిగింది. టీవీ9లో తాను మైనార్టీ షేర్ హోల్డర్‌నని, తనకు తెలియకుండా షేర్లు అమ్మారంటూ లా ట్రిబునల్‌ను నటుడు శివాజీ ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+