అబద్దాలతో పదవీ.. రెండుసార్లు సీఎంగా అవకాశం, కేసీఆర్‌పై రేవంత్ నిప్పులు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అబద్ధాలతో కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారని విమర్శించారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ప్రకటించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. నాలుగేళ్లలో 74 వేల మంది రైతులు చనిపోయారని, వారికి రైతుబంధు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తానని చెప్పి.. చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడల్లో భాగంగా వరి పండించే రైతులతో చెలగాటం ఆడుతున్నారు. సీఆర్ తీరుతో వానాకాలం సీజన్ లో వందలాది మంది రైతులు చనిపోయారు. ఇప్పుడు గోనె సంచులు, ట్రాన్స్ పోర్ట్ లేకుండా కుట్ర చేశారు. ఇప్పటికే రైతులు మూడు వేల కోట్లు నష్టపోయారు.

మిల్లర్లు సేకరించిన ధాన్యానికి అధిక ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఎఫ్ సీఐకి బియ్యం ఇవ్వకుండా రూ.3 వేల కోట్ల స్కాం చేశారు. ఈ స్కామ్ పై సీబీఐ విచారణ చేయాలి. సీఎస్ ఆధ్వర్యంలో దోపిడీకి కొత్త స్కెచ్ వేశారు. రూ.2,800 కోట్లలో కేసీఆర్ కుటుంబం, మిల్లర్ల దోపిడీ ఎంతనేది తేలాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో.. పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. రాహుల్ సభ ద్వారా.. త్వరలో రానున్న సోనియమ్మ రాజ్యంలో రైతులకు ఏం చేస్తామో చెప్తాం. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చాం. మద్దతు ధర, రైతు పాలసీలను చేశాం. గతంలో కాంగ్రెస్ తెచ్చిన రైతు పాలసీలకు మోదీ, కేసీఆర్ తూట్లు పొడిచారు. బీజేపీ, టీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను రాహుల్ సభ ద్వారా ఎండగడతామని చెప్పారు.
-
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. గులాబీ పార్టీ మూలాలపై గురి! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications