Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డికి పిసీసీ పగ్గాలు..! తెలంగాణ కాంగ్రెస్ లో కుమ్ములాటలేనా..?

Recommended Video

    రేవంత్ రెడ్డికి పిసీసీ పగ్గాలు అప్పగించే యోచనలో ఏఐసీసీ|Revanth Reddy As TPCC Chief Chances To Oppose

    హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ అదిష్టానం. సోనియా గాంధీ ఏఐసిసి అద్యక్షురాలు అయిన తర్వాత దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రాంతీయంగా పార్టీలను పునర్మించేందుకు పావులుకదుపుతోంది కాంగ్రెస్ అదిష్టానం. ప్రస్తుతం కొనసాగుతున్న పీసీసీ అద్యక్షులను మార్చి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా ప్రణాళిక రచిస్తోంది కాంగ్రెస్. తెలంగాణలో క్రియాశీల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి కి తెలంగాణ పిసీసీ అద్యక్షుడిని చేయాలని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక వేళ పిసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపడితే స్ధానికంగా ఉన్న సీనియర్ నేతలనుండి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

    టీపిసిసి ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..! కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెల్లుబికే అవకాశం..!!

    టీపిసిసి ఛీఫ్ గా రేవంత్ రెడ్డి..! కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పెల్లుబికే అవకాశం..!!

    అనుకున్నంత అయింది.. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీపీ పగ్గాలు అప్పగిస్తారనే వార్త తెలంగానలో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి తాజాగా డిల్లీ వెళ్లి, సోనియాగాందీని కలిశారు. అంతవరకూ బాగానే ఉంది. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. టీడీపీలో ఉండగానే రేవంత్ తిరుగులేని నేతగా ఎదిగారు. అన్నింటినీ మించి. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ను దీటుగా ఎదిరించి నిలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో చంద్రశేఖర్ రావు రేవంత్ రెడ్డిని నలువైపుల నుంచి కమ్మేయటంతో కొడంగల్ లో ఓటమి చవిచూశారు.

    రేవంత్ రెడ్డికి కత్తిమీద సామే..! సీనియర్లను ఒప్పించుకోవాల్సిన బాద్యతకూడా తనదే..!!

    రేవంత్ రెడ్డికి కత్తిమీద సామే..! సీనియర్లను ఒప్పించుకోవాల్సిన బాద్యతకూడా తనదే..!!

    కొడంగల్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు వినూత్న తీర్పు ఇచ్చారు. మల్కాజిగిరి వంటి పేద్ద పార్లమెంటరీ నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీతో ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించారు. అది చాలు రేవంత్ రెడ్డి సత్తా చాటేందుకు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అందుకే, మున్ముందు స్థానిక ఎన్నికలు, మున్సిపోల్స్, 2024 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఎదిగేందుకు రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించే అంశాన్ని సోనియా గాంధీ లోతుగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రేవంత్ కు అనుకూలంగా కాంగ్రెస్ అదిష్టానానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

    పిసీసీ ఆశిస్తున్న ప్రముఖ నేతలు..! రేవంత్ కు పగ్దాలు ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవంటున్న నేతలు..!!

    పిసీసీ ఆశిస్తున్న ప్రముఖ నేతలు..! రేవంత్ కు పగ్దాలు ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవంటున్న నేతలు..!!

    ఎంపీగా గెలిచిన ఉత్తమ్ ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్నారు. హుజూర్ నగర్ లో భార్య పద్మావతిని పోటీచేయించి సొంతసీటును కాపాడుకోవాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. అంతా బాగానే ఉన్నా, ఇప్పటికే పీసీసీ పీఠంపై కన్నేసిన కోమటిరెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎంత వరకూ అంగీకరిస్తారనేది ప్రధాన సమస్య. జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, గీతా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్లు కడా పీఠంపై కూర్చోవాలని ఆశపడుతున్నారు. వి.హన్మంతరావు అయితే, తనకు పీసీపీ ఇవ్వకపోతే పార్టీ మారిపోతానంటూ ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు.

    సీనియర్లను కన్విన్స్ చేసుకోవాలి..! రేవంత్ ముంది పెద్ద టాస్కే ఉంది..!!

    సీనియర్లను కన్విన్స్ చేసుకోవాలి..! రేవంత్ ముంది పెద్ద టాస్కే ఉంది..!!

    అంతే కాకుండా బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందంటూ ఊరూవాడా చాటింపు వేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు వీహెచ్. ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్ష పదవి చేపట్టినా, ఎంత వరకూ సీనియర్లను ఒప్పించి నెగ్గుకు రాగలుగుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పార్టీలో పీసిసి పదవిపైన ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలందరిని రేవంత్ రెడ్డి కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే పార్టీలోని సీనియర్లను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అదే సమయంలో గాంధీభవన్ రాజకీయాలను కూడా రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+