Road Accident: గాల్లోకి యువకుడు.. వైరల్ అయిన వీడియో.. ఫోన్ మాట్లాడితే అంతే..!
రోడ్డు మీదికి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. హైదరాబాద్-వరంగల్ హైవే దాటుతున్న ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. అయితే అతన్ని కారు ఢీకొట్టింది. జులై 14న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్‌టీపీసీ ఎక్స్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి గాలిలోకి ఎగిరి పడ్డారు.
దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే కారు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా గిరిబాబును ఢీకొట్టింది. గిరిబాబు తీవ్రంగా గాయపడగా.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

In yet another accident, a man crossing the Hyderabad-Warangal highway was struck by a car.
— The Siasat Daily (@TheSiasatDaily) July 15, 2024
Following the collision, the man was thrown into the air near NTPC X road. pic.twitter.com/Ah02zZfNNP
మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాజాగా హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి హత్యకు గురయ్యాడు. బైక్‌ను మరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గత నెలలో అత్తాపూర్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 16 ఏళ్ల బాలిక మినీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గతంలో గచ్చిబౌలిలో బైక్ అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో 22 ఏళ్ల ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.












Click it and Unblock the Notifications