హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫన్నీ వీడియో.. టీవీఎస్ XL దెబ్బకు బుల్లెట్ ఢమాల్.. బొక్కేట్టేసిందిగా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. అదే కోవలో ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సీరియస్ విషయమే అయినప్పటికీ.. చూడటానికి మాత్రం ఫన్నీగా కనిపిస్తోంది. నాతో పెట్టుకుంటావా అన్నట్లుగా ఓ చిన్న వాహనం పెద్ద బండిని ఢీకొట్టి తునాతునాకలు చేసిన సన్నివేశం ఎక్కడో జరిగిందో తెలియదు గానీ చూస్తే మాత్రం కచ్చితంగా నవ్వు ఆగదంటే నమ్మండి. ఈ వీడియో చూసి మీరు కూడా సరాదాగా కాసేపు నవ్వుకోండి.

డుగ్ డుగ్ సౌండ్‌కు బదులు డగ్ డగ్ అయిందిగా..!

డుగ్ డుగ్ సౌండ్‌కు బదులు డగ్ డగ్ అయిందిగా..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి తెలుసుగా.. రాజసం ఒలకబోస్తూ రోడ్లపై యూత్ చక్కర్లు కొట్టేందుకు భలేగా ఉంటుంది. డుగ్ డుగ్ సౌండ్‌తో రోడ్ల మీద వెళుతుంటే.. దారిన పోయే వారందరి చూపు దాని వైపే తిప్పుకుంటుంది. అంతలా అట్రాక్టివ్ స్పెషల్ బైక్ బరువు ఎంతుంటుందో ఊహించుకుంటే చాలు తెలిసిపోతుంది. అయితే సాధారణ బైకుల కన్నా అధికంగా బరువుండే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. టీవీఎస్ ఎక్స్‌ఎల్ బండి దెబ్బకు తుక్కు తుక్కయింది. చివరకు ఎలా అయిందంటే.. ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా.. ఆకుకే బొక్క అనే సామెతను తిరగరాసింది. అంత పెద్ద బండిని గుద్దేసి తనకు మాత్రం బొక్కేట్టేసుకోకుండా బయటపడిందన్నమాట.

వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు విద్యార్థులు బలి.. మద్యం మత్తులో డ్రైవర్..!వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు విద్యార్థులు బలి.. మద్యం మత్తులో డ్రైవర్..!

అరే.. అంత చిన్న బండి గుద్దితే ఇంత డ్యామేజీయా?

అరే.. అంత చిన్న బండి గుద్దితే ఇంత డ్యామేజీయా?

చిరు వ్యాపారులు సాధారణంగా టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాలను బాగా ఉపయోగిస్తుంటారు. చిన్నగా, ముద్దుగా ఉండే ఈ బండ్లు చిరు వ్యాపారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. తక్కువ బరువుండి ముందు భాగంతో పాటు వెనుక సైడ్ కూడా సరుకులు పెట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ క్రమంలో పల్లెల నుంచి పట్నాల దాకా బాగా సేల్ అవుతున్న వాహనాల్లో ఇదొకటి. చూస్తే పాతకాలం నాటి లూనాలా కనిపించే టీవీఎస్ ఎక్స్‌ఎల్.. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం బాగా డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకంటే దాని బలం, ప్రాణం అంతేగా మరి.

బక్క జీవి బండి బలమెంతంటే.. ఈ వీడియో చూస్తే షాకేగా మరి..!

అయితే ఈ వీడియో చూస్తే ఇన్నాళ్లు మీరు చూసిన ఆ బక్క పలుచని వాహనంపై మీ అభిప్రాయం మార్చుకుంటారు. దాని బలమేంటో తెలుసుకుంటారు. కిలోల కొద్దీ బరువుండే రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాన్ని ఢీకొట్టి సంచలనం సృష్టించిన ఆ బక్క జీవి బండి వీడియో తెగ వైరల్ అవుతోంది. అరే.. అంత బరువున్న వాహనాన్ని ఢీకొడితే.. తుక్కు తుక్కు కావాల్సిన చిన్న వాహనం మాత్రం ఠీవిగా నిలబడింది. అంత పెద్ద బండి మాత్రం ఢమాలైంది. ఎక్కడికక్కడ పార్టులు ఊడిపోయి ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతటి దీనస్థితిలో కనిపిస్తున్న ఈ వాహనం చూసి రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహన ప్రియులు ఎలా ఫీలవుతారో పాపం.

ఆ బండి గుద్దితే డ్యామేజీయా.. లేదంటే కిందపడితే ఇలా జరిగిందా?

ఆ బండి గుద్దితే డ్యామేజీయా.. లేదంటే కిందపడితే ఇలా జరిగిందా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ అంటేనే యూత్‌లో అదొక క్రేజ్. దానిపై చక్కర్లు కొడుతూ ఆనాడు గుర్రాలపై స్వారీ చేసిన రాజుల్లా ఫీలయ్యే సందర్భాలు చాలా కనిపిస్తుంటాయి. అయితే ఈ వీడియోలో మాత్రం టీవీఎస్ ఎక్స్‌ఎల్ ధాటికి కుప్పకూలిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. అది ఎంతవరకు నమ్మశక్యం అనేది కాస్తా అనుమానించదగ్గ విషయమే. యాక్సిడెంట్ జరిగిన క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కిందపడి బాగా డ్యామేజీ అయి ఉండొచ్చనే వాదనలు లేకపోలేదు.

English summary
A Video Viral In Social Media that small vehicle TVS XL met with accident to ROYAL ENFIELD. But, there is no damage to Small Vehicle of TVS XL, in that way Royal Enfield was fully damaged. Netizens express their views differently as how it is possible and funny.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X