Tea: టీ పొడి రూ.1 లక్ష.. టీ రూ.1000.. ఎక్కడంటే..!
అసోంలోని మనోహరి గోల్డ్ టీ అనే అరుదైన టీ కిలో రూ.లక్ష పలికి రికార్డు సృష్టించిన సంగతి తెలింది. మనోహరి గోల్డ్ చాలా ప్రత్యేకమైన టీ. 2020లో గౌహతి టీ వేలం కేంద్రంలో కిలో రూ. 75,000 చొప్పున పలికింది. ఇంతకు ముందు 2018లో, మనోహరి గోల్డ్ టీ చరిత్రలో మొదటిసారిగా కిలో రూ. 39,001 పలికింది. 2019 సంవత్సరంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టి కిలోగ్రాము రూ.50,000 పలికింది.
టీ పౌడర్ తో పాటు టీ ధర కూడా ఎక్కువుంటుందని మీకు తెలుసా... అవును మన దగ్గర రూ.1000 టీ కూడా ఉంది. అది మన హైదరాబాద్ లోనే రూ.1000 లకు టీ అమ్ముతున్నారు. పట్నంలో రెండు చోట్ల మాత్రమే ఈ టీని అమ్ముతున్నారు. ఈ వెయ్యి రూపాయల చాయ్ కేఫ్ నిలోఫర్ బ్రాంచుల్లో లభిస్తోంది. ఈ టీ తాగాలనుకున్న వారు సిటీలోని బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ లోని కేఫ్ నిలోఫర్ వెళ్లాల్సిందే. ఇంతా ఎక్కువ ధరలో టీ తాగుతారా అంటే.. తాగేవారు ఉన్నారు. విషయమేమిటంటే ఈ టీని పాలు పోయకుండా తయారు చేస్తారట.

అసోంలోని బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతం మైజాన్ టీ తోటల్లోని గోల్డెన్ టిప్స్‌గా పేరొందిన తేయాకు మొగ్గల నుంచి ఈ చాపత్తను తయారు చేస్తారని చెబుతున్నారు. ఈ టీ పౌడర్ ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందట.












Click it and Unblock the Notifications