హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.2.5 కోట్ల నగదు: సిటీలో భారీగా హవాలా మనీ, వారంలో రెండోసారి

|
Google Oneindia TeluguNews

భాగ్యనగరంలో హవాలా నగదు భారీగా డబ్బు పట్టుబడుతోంది. ఇటీవల రూ.2 కోట్లు దొరకగా.. ఇవాళ మరోసారి నగదు దొరికింది. పక్క సమాచారంతో పోలీసులు రైడ్ చేస్తున్నారు. వారికి అందిన సమాచారంతో దాడులు చేపట్టగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడుతుంది. దీంతో మరింత పకడ్బందీగా సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్ సిటీ హవాలా డబ్బుకు అడ్డాగా మారిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. సిటీలో ఇటీవల భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది.రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లో 54 లక్షల రూపాయల డబ్బు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇవాళ అదే ప్రాంతంలో మరో 2.5 కోట్ల రూపాయల హవాలా డబ్బు పట్టుబడింది.

rs.2.5 crore hawala money seized by hyderabad city police.

ఆ నగదును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. డబ్బుతో దొరికిన వారిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు రూ.4 కోట్ల హవాలా డబ్బును పోలీసులు సీజ్ చేశారు. వారం వ్యవధిలోనే ఇంత మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది.

ఒక వైపు డ్రగ్స్ సరఫరా.. మరోవైపు హవాలా నగదు కూడా పట్టుబడుతోంది. వాస్తవానికి సిటీలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయినప్పటికీ గుట్టుగా దందా సాగుతూనే ఉంది. మరికొన్ని ఇష్యూస్ వెలుగులోకి రావడం లేదని అంటున్నారు.

English summary
rs.2.5 crore hawala money seized by hyderabad city police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X