రూ.2 వేల కోట్ల దోపిడీ.. 30 ఎకరాల భూమిలో అవకతవకలు.. రేవంత్ రెడ్డి

నీళ్లు, నిధులు, నియమకాలు అని చెప్పి దోపిడీ చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మండిపడింది. రాష్ట్రంలో యదేచ్చగా దోపిడీ జరుగుతుందని ఆరోపించింది. మంత్రి కేటీఆర్ లక్ష్యంగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ షేక్‌పేట మండలం షేక్‌పేట గ్రామంలో గల సర్వే నంబరు 327లో 30 ఎకరాలకుపైగా ఉన్న‌ ప్ర‌భుత్వ భూమిలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయట. ఓ దిన‌ప‌త్రిక‌లో వచ్చిన క‌థ‌నాన్ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదీ అక్రమం కాకుంటే మరీ ఏంటీ అని అడిగారు.

సర్వే నంబ్ 327..

సర్వే నంబ్ 327..

సర్వే నంబరు 327లోనిది తమ భూమే అని ప్రభుత్వం కోర్టుల్లో వాదిస్తోంది. తుది తీర్పునకు లోబడే తాము ఆ భూముల‌కు సంబంధించిన‌ విష‌యాల్లో ముందుకు వెళ్తున్నామనే షరతుతో ప్రైవేటు వ్యక్తులకు జీహెచ్‌ఎంసీ తుది లే అవుట్‌ అనుమతులు ఇచ్చింది. ఆయా అంశాల‌ను ప్రస్తావిస్తూ తెలంగాణ స‌ర్కారుపై రేవంత్ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. సిటీ నడిబొడ్డున రూ.2000 కోట్ల దోపిడీ వెనుక ఉన్న ముఠా నాయకుడు ఎవరు? అని అడిగారు.

కేటీఆర్‌కు తెలియదా..?

కేటీఆర్‌కు తెలియదా..?

మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కి తెలియకుండా దోపిడీ సాధ్యమా? అని అడిగారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు లేకుండా సీఎస్, మునిసిపల్ కమిషనర్లు వ్యవహరించగలరా? అని అడిగారు. సర్వే నంబర్ 327లో లే అవుట్ అనుమతులు రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

రూ.2 వేల కోట్ల దోపిడీ

రూ.2 వేల కోట్ల దోపిడీ

రాష్ట్రంలో భూ మాఫియా నడుస్తోందని.. వారికి పెద్దల అండ దండలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చాలా సార్లు ఆరోపణలు రాగా.. ఇవాళ రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ లక్ష్యంగా ఆయన విమర్శలు చేశారు. వెలుగులోకి వచ్చినందున.. స్పందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రూ.2 వేల కోట్ల దోపిడీ వెనక ఉన్నది ముమ్మాటికీగా కేటీఆర్ అంటూ రేవంత్ ఫైరయ్యారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని.. ఏమీ మిగలనీయడం లేదన్నారు. ఉన్న భూములును అమ్మివేసి మరీ పాలన చేస్తున్నారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+