ఇక ఛార్జీల వాత.. ఆర్టీసీ ఛార్జీ పెంపు..? కరెంట్ బిల్ కూడా.. బై పోల్ ఫలితంతో..?

హుజురాబాద్ పోరు ముగిసింది. అధికార టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇంకేముంది దళితబంధు ఊసేలేదు. దానికి అదనగా ఛార్జీల వడ్డన షురూ కానుంది. అవును ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా సంస్థలకు పర్మిషన్ ఇవ్వగా.. అవీ వచ్చేవారంలో ధరల పోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. మళ్లీ సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం వేసేందుకు సర్కార్ సిద్దంగా ఉంది. వ్యతిరేక తీర్పు ప్రభావంతో.. వెంటనే జనం నెత్తిన ఛార్జీల భారం మోపాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ చర్యలను బట్టి అర్థమవుతుంది.

ఆర్టీసీ ఛార్జీ పెంపు.?

ఆర్టీసీ ఛార్జీ పెంపు.?

తెలంగాణ‌ రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ఒకసారి చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. వేలకోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్జీసీ ఛార్జీలు పెంచడం తప్ప తమకు గత్యంతరం లేదని చెబుతోంది. ఆర్టీసీ నిర్ణయం తీసుకుందో లేదో తెలంగాణ స‌ర్కార్ వెనువెంటనే ఆమోద ముద్ర వేసింది. తొలినుంచే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. కరోనా సమయంలో ఆర్టీసీ పై మరింత ప్రభావం పడింది. బ్యాంకుల నుంచి ఆర్టీసీ తీసుకున్న అప్పుల భారం మోయలేక పోతోంది. ఇవన్నీ కారణాలు చూపుతూ జనం జేబులకు చిల్లు పెట్టేందుకు ప్రగతి రథ చక్రాలు సన్నద్ధం అవుతున్నాయి.

కరెంట్ బిల్లుల వాత

కరెంట్ బిల్లుల వాత

ఆర్టీసీ ఛార్జీల భారం వేయడమే కష్టంగా ఉంది. దానిపైనే ఊసురుమంటుంటే.. విద్యుత్ ఛార్జీల వాత కూడా పెట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది. విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరిగిన చార్జీలను త్వరలో అమలు చేసే అవకాశం ఉంది. పవర్ చార్జీ పెంచాలనే డిస్కంల ప్రతిపాదనకు కేసీఆర్ సర్కార్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కరెంట్ బిల్లుల వాత కూడా మరో వారంలో ఉండనుంది. సో త్వరలో ఆర్టీసీ, కరెంట్ బిల్లుల మోత ఉండనుందని స్పష్టం అవుతుంది.

 ఆగిన దళితబంధు

ఆగిన దళితబంధు

దళితబంధు పథకాన్నీ హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొందరు అర్హులకు నిధులు కూడా మంజూరు చేశారు. ఇటు సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో కూడా దళితబంధు పథకం ప్రారంభించారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలను అందజేస్తారు. అయితే ఉప ఎన్నిక వేళ ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయిన క్రమంలో.. ఎన్నికల కోడ్ వెళ్లింది. దీంతో పథకం మళ్లీ ప్రారంభించవచ్చు. కానీ అధికార పార్టీ అందుకు సుముఖంగా ఉండకపోవచ్చునని అనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+