వావ్.. సజ్జనార్, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అంటే ఇదే.. జెండాపై ఆర్టీసీ ముద్ర
సజ్జనార్.. ఆర్టీసీకి ఓ వెలుగు తీసుకొచ్చారు. ప్రమోషన్స్, ప్రచాంతో హైప్ తెచ్చారు. అంతేకాదు సమస్య ఉందని తెలిస్తే వెంటనే పరిష్కారం చేస్తున్నారు. అలా తెలంగాణ ఆర్టీసీ పేరు మారుమోగుతుంది. అలాగే సజ్జనార్ ట్రెండ్‌కి తగినట్టు నడుచుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా వస్తోన్న మూవీలతో సంస్థను ప్రమోట్ చేస్తున్నారు.

తగ్గేదేలే..
టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పబ్లిసిటీ విషయంలో తగ్గడం లేదు. పాపులర్ అయిన సినిమా పోస్టర్ ఏది విడుదలైనా.. దానిని టిఎస్ఆర్టీసీ పేరుతో ప్రచారానికి వాడుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్' అర్థమే మార్చేశారు. 'ఆర్ఆర్ఆర్' అంటే 'రాష్ట్ర రోడ్డు రవాణా' అంటూ కొత్త అర్థాన్ని చెప్పారు. తాజాగా విడుదలైన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' సాంగ్‌ని కూడా ఆయన ప్రచారానికి వాడేశారు.

వందేమాతరం స్థానంలో
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ జెండా పట్టుకుని పాడుతున్న పాటలో జెండాపై మాములుగా 'వందేమాతరం' అని ఉంటుంది. కానీ దానిని సమూలంగా మార్చివేశారు. ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో తన క్రియేటివిటీని ప్రదర్శించారు. చరణ్, తారక్ పట్టుకున్న జెండాపై.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన అక్షరాలతో పాటు లోగోని, బస్సుని పెట్టి రెపరెపలాడించారు.

వావ్.. అంటోన్న జనం
దానిని చూసిన నెటిజన్లు.. సజ్జనార్ క్రియేటివిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సజ్జనార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. వావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్టీసీని ఉన్నత శిఖరాలకు తీసుకెళతారు అని కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఆర్టీసీలో సమూల మార్పులు జరిగాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వెంటనే రియాక్ట్
ఇంతకుముందు చాలా సమస్యలను సజ్జనార్ పరిష్కరించారు. ట్వీట్ చేస్తే చాలు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆర్టీసీ ఆర్డీనరీ బస్సు వెళ్లని.. చాలా చోట్లకు సజ్జనార్ వల్ల సర్వీస్ ఇస్తోంది. సంస్థాగతంగా మార్పులు.. కొలువుల భర్తీ చేయడం చేస్తున్నారు. ఒక్కో అంశాన్ని తీసుకొని.. పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు అయితే అన్నీ సమస్యలను సాల్వ్ చేశారు సజ్జనార్.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications