RTC: ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు.. ఎక్కడ నుంచి అంటే..!

శనివారం హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఆర్‌జిఐసి)కి ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. IPL 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ క్రికెట్ మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రేక్షకుల సౌకర్యార్థం ఈ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జోన్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య నడుస్తాయి.

ప్రత్యేక బస్సులు ఎక్కడ నుంచి అంటే : ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ ఆర్‌జిఐసి స్టేడియం, హయత్ నగర్ నుంచి ఉప్పల్ RGIC స్టేడియం, NGO కాలనీ నుంచి ఉప్పల్ RGIC స్టేడియం, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోటి, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, దిల్ సుఖ్ నగర్, జీడిమెట్ల, కేపీహెచ్ బీ, మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, హకీంపేట, ఈసీఐఎల్, బోయిన్ పల్లి, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, కొండాపూర్, BHEL, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ స్టేడియానికి ఈ బస్సులు నడపనున్నారు.

 uppaltsrtc-

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికులను రాత్రి 7 గంటల వరకు తీసుకెళ్లేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కాగా ఐపీఎల్ 2023 సన్ రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపు ముగిసినట్లే. మిగతా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచినా.. ఎస్ఆర్ హెచ్ ఫ్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.

ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెంచుకోవడానికి అనే చర్యలు తీసుకుటుంది. ఇందులో భాగంగా టీ 24 టెకెట్ తీసుకొచ్చింది. ఈ టికెట్ తీసుకుని 24 గంటలు సిటీ బస్సుల్లో తిరగొచ్చు. టీ 24 టికెట్ సాధారణ ప్రజలకు రూ. 90 లు కాగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ. 80 లకే ఇస్తున్నారు. టీ 23 కాదు టీ 6 టికెట్ కూడా తీసుకొచ్చింది. రూ. 50 టీ 6 టికెట్ తీసుకుని ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు సిటీ బస్సుల్లో తిరగొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+